బైండర్ తో సీబీఐటీ ఒప్పందం

3 May, 2016 01:36 IST|Sakshi
బైండర్ తో సీబీఐటీ ఒప్పందం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఎడ్యుకేషన్ స్టార్టప్ బైండర్‌తో... చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో సీబీఐటీ ఉపాధ్యాయులలకు, విద్యార్థులకు క్లౌడ్ ఆధారంగా పనిచేసే లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్ (ఎల్‌ఎంఎస్) సేవలను అందిస్తామని బైండర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంకా చెప్పాలంటే తరగతిలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కళాశాల పూర్తయ్యాక కూడా బైండర్ టెక్నాలజీ ఆధారంగా విద్యార్థులకు టచ్‌లో ఉంటారన్నమాట.

దీంతో విద్యార్థులకు ఎలాంటి సందేహాలొచ్చినా అప్పటికప్పుడే నివృత్తి చేసుకునే అవకాశముంటుంది. ఇప్పటికే బైండర్ సేవలను గుంటూరులోని వీవీఐటీ, జనగాంలోని సీజేఐటీఎస్‌లతో పాటుగా హైదరాబాద్‌లోని శ్రీనిధి, వర్ధమాన్, మల్లారెడ్డి గ్రూప్, వీబీఐటీ, సీవీఎస్‌ఆర్ వంటి సుమారు 33 కళాశాలలు వినియోగించుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో సీబీఐటీ ప్రిన్సిపల్ డాక్టర్ బి.చెన్నకేశవ రావు, డెరైక్టర్ ప్లేస్‌మెంట్స్ డాక్టర్ ఎన్‌ఎల్‌ఎన్ రెడ్డి, బైండర్ కో-ఫౌండర్, యూనివర్సిటీ రిలేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంతి వంగీపురం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు