కోల్ ఇండియా లాభం 16% అప్

14 Nov, 2015 01:14 IST|Sakshi
కోల్ ఇండియా లాభం 16% అప్

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు గనుల కంపెనీ కోల్ ఇండియా నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌లో 16 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.2,192 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.2,544 కోట్లకు పెరిగిందని కోల్ ఇండియా తెలిపింది. అమ్మకాలు అధికంగా ఉండటంతో నికర లాభం పెరిగిందని పేర్కొంది. నికర అమ్మకాలు రూ.15,678 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.16,958 కోట్లకు పెరిగాయని వివరించింది.

అధిక ఉత్పత్తి కారణంగా అమ్మకాలు పెరిగాయని పేర్కొంది.  మొత్తం వ్యయాలు రూ.14,145 కోట్ల నుంచి రూ.15,068 కోట్లకు ఎగిశాయని తెలిపింది. గత క్యూ2లో 102.42 మిలియన్ టన్నులుగా ఉన్న బొగ్గు ఉత్పత్తి ఈ క్యూ2లో 108.2 మిలియన్ టన్నులకు చేరిందని కోల్ ఇండియా తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో కోల్ ఇండియా షేర్ 2.6 శాతం వృద్ధితో రూ.338 వద్ద ముగిసింది.

>
మరిన్ని వార్తలు