క్రిసిల్‌ లాభం రూ.77 కోట్లు

18 Jul, 2018 00:47 IST|Sakshi

14 శాతం వృద్ధి

రూ. 6 మధ్యంతర డివిడెండ్‌  

ముంబై: ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.77 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం (రూ. 67 కోట్లు)తో పోల్చితే 15 శాతం వృద్ధి సాధించామని క్రిసిల్‌ తెలిపింది.

ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.436 కోట్లకు, ఇతర ఆదాయం దాదాపు రెట్టింపై రూ.17 కోట్లకు పెరిగాయని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ అషు సుయాశ్‌ చెప్పారు. ఒక్కో షేర్‌కు రూ.6 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. దేశీయ కంపెనీల బాండ్ల జారీ బాగా తగ్గినప్పటికీ తమ కీలక వ్యాపారం రేటింగ్స్‌ విభాగం మంచి వృద్ధినే సాధించిందని వివరించారు.

మరిన్ని వార్తలు