తగ్గిన ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు

2 Aug, 2019 08:52 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్‌ వాహన (పీవీ) విక్రయాలు మరింత నీరసించాయి. జూలైలో  మొత్తం పీవీ అమ్మకాలు రెండంకెల క్షీణతను నమోదుచేశాయి. హోండా కార్స్‌ ఇండియా విక్రయాలు ఏకంగా 49 శాతం క్షీణించగా.. ఈ విభాగంలో మార్కెట్‌ లీడరైన మారుతీ సుజుకీ ఇండియా అమ్మకాలు 36 శాతం తగ్గాయి. అశోక్‌ లేలాండ్‌ విక్రయాలు 29 శాతం పడిపోయాయి. వినియోగదారుల సెంటిమెంట్‌ దెబ్బతిన్న కారణంగా ఆటో రంగం అమ్మకాలు పడిపోతూ వస్తున్నాయని ఎం అండ్‌ ఎం చీఫ్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ (ఆటోమోటివ్‌ డివిజన్‌) వీజయ్‌ రామ్‌ నక్రా అన్నారు. కొనుగోళ్లు వాయిదా పడిన నేపథ్యంలో విక్రయాలు తగ్గాయని హెచ్‌సీఐఎల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేష్‌ గోయల్‌ వ్యాఖ్యానించారు. అధిక బీమా, ద్రవ్యలభ్యత కొరత, వర్షాకాలం ఆలస్యం కావడమే ఇందుకు కారణమని టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ డిప్యూటీ ఎండీ ఎన్‌ రాజా అన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు