డాక్టర్ రెడ్డీస్‌కు ఉమాంగ్ గుడ్‌బై

28 Aug, 2015 01:29 IST|Sakshi
డాక్టర్ రెడ్డీస్‌కు ఉమాంగ్ గుడ్‌బై

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు... ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఉమాంగ్ వోరా గుడ్ బై చెప్పారు. ఇప్పటి వరకు ఆయన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉత్తర అమెరికా జనరిక్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. గతంలో కంపెనీ సీఎఫ్‌వోగా కూడా పనిచేశారు. 13 ఏళ్ళుగా డాక్టర్ రెడ్డీస్‌లో పనిచేసిన వోరా... కంపెనీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. సిప్లాలో కీలక పదవిలో చేరుతున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇక ఆయన రాజీనామాతో కీలక హోదాల్లో డాక్టర్ రెడ్డీస్ పలు మార్పులను చేసింది. వోరా స్థానంలో అలోక్ సోనిగ్‌ను నియమించింది.

ఇప్పటి వరకు ఆయన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఇండియా జనరిక్స్ హెడ్‌గా ఉన్నారు. కంపెనీ మేనేజ్‌మెంట్ కౌన్సిల్‌లోనూ ఆయన సభ్యుడిగా పనిచేస్తున్నారు. 2012లో డాక్టర్ రెడ్డీస్‌లో చేరారు. అంతకు ముందు వరకు ఆయన 2007 నుంచి బ్రిస్టల్ మేయర్స్ స్క్విబ్(బీఎంఎస్) ఇండియా చీఫ్‌గా విధులు నిర్వర్తించారు. బీఎంఎస్‌లో ఉన్న సమయంలో యూఎస్ మార్కెట్లోనూ పనిచేశారు. ఎమర్జింగ్ మార్కెట్స్ బిజినెస్‌ను పర్యవేక్షిస్తున్న ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎం.వి.రమణకు ఇండియా, ఎమర్జింగ్ దేశాల బ్రాండెడ్ మార్కెట్స్ హెడ్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

మరిన్ని వార్తలు