అమెరికా వడ్డీరేటు పావు శాతం కోత

1 Aug, 2019 04:52 IST|Sakshi

2008 ఆర్థిక సంక్షోభం తర్వాతతొలిసారి రేటును తగ్గించిన ఫెడరల్‌ రిజర్వ్‌

వాషింగ్టన్‌: అంచనాలకు అనుగుణంగా అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక వడ్డీ రేటును పావు శాతం మేర తగ్గించింది. దీంతో వడ్డీ రేటు శ్రేణి 2–2.25 శాతం స్థాయికి దిగి వచ్చింది. 2008 తర్వాత ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గించడం ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడం, ద్రవ్యోల్బణం నిర్దేశించుకున్న స్థాయికంటే (2 శాతం) దిగువనే ఉండటం తదితర అంశాలు పరిగణనలోకి తీసుకుని రేట్లను తగ్గించినట్లు ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (ఎఫ్‌వోఎంసీ) తెలిపింది. ఆర్థిక మాంద్యం పరిస్థితులేమీ లేకుండా, ఎకానమీ పటిష్టంగా ఉన్న సమయంలో ఇలా వడ్డీ రేట్లను తగ్గించడం 1998 తర్వాత ఇదే తొలిసారి. ఎకానమీకి ఊతమిచ్చేలా వడ్డీ రేట్లను అరశాతమైనా తగ్గించాల్సి ఉంటుందంటూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒత్తిడి చేస్తున్నప్పటికీ రేట్ల కోతను పావు శాతానికి పరిమితం చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు