ఇన్వెస్ట్‌మెంట్‌కు ఈ 5రంగాలు అనుకూలం.!

10 Jul, 2020 14:27 IST|Sakshi

మార్కెట్‌ నిపుణుడు అతుల్‌ భోలే

ప్రస్తుతం మార్కెట్లో రిస్క్‌ను ఎదుర్కోనే సత్తా కలిగిన ఇన్వెస్టర్లకు మార్కెట్‌ నిపుణుడు అతుల్‌ భోలే 5రంగాల షేర్లను సూచిస్తున్నారు. ఫైనాన్సియల్‌, కెమికల్స్‌, ఫెర్టిలైజర్స్‌, సిమెంట్‌, టెలికాం రంగాల షేర్లు అందులో ఉన్నాయి. ఏడాది నుంచి ఏడాదిన్నర కాలపరిమితి దృష్ట్యా కొనుగోలు చేయవచ్చని భోలే సలహానిస్తున్నారు. ఈ 5రంగాల షేర్లపై విశ్లేషణలను ఇప్పుడు చూద్దాం...

ఫైనాన్షియల్‌ స్టాక్స్‌: ప్రస్తుత ర్యాలీ ముగింపు తర్వాత కూడా ఫైనాన్స్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశం ఉంది. ఈ రంగాల షేర్ల ధరలను పరిశీలిస్తే, కోవిడ్-19 పతనం తర్వాత జరిగిన రికవరీలో భాగంగా ఇప్పటికీ 35శాతం వెనకబడి ఉన్నాయి. ఇదే సమయంలో ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా షేర్లు ప్రీ-కోవిడ్‌ స్థాయిలో లేదా అంతకుమించి రికవరీని సాధించాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఈరంగ షేర్లు ర్యాలీ చేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

అగ్రో కెమికల్స్‌, ఫైర్టిలైజర్‌ స్టాక్‌: ఈ ఏడాది వర్షపాతం సాధారణ స్థాయిలో నమోదు అవుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ఫెర్టిలైజర్‌ కంపెనీలకు కలిసొచ్చే అంశం అవుతుంది. ప్రపంచస్థాయి అగ్రో కెమికల్స్‌ కంపెనీలకు ఏమాత్రం తక్కువగా కాకుండా మనదేశ అగ్రో కంపెనీలు నిర్వహణ సామర్థా‍్యన్ని కలిగి ఉన్నాయి. కోవిడ్‌ అనంతరం పలు అంతర్జాతీయ అగ్రో కంపెనీలు చైనా నుంచి భారత్‌కు తరలిరావాలనే యోచనలో ఉన్నాయి. కాబట్టి అటు వ్యాపార కోణం నుంచి అగ్రి కెమికల్స్‌ కంపెనీలకు కలిసొస్తుంది. 

సిమెంట్‌, టెలికాం షేర్లు: గత మూడేళ్లుగా ఈ రంగాల్లో కన్సాలిడేట్‌ జరిగింది. ప్రస్తుతం సిమెంట్‌, టెలికాం కంపెనీలు కన్షాలిడేట్‌ అనంతరం లాభాల్ని ఆర్జిస్తున్నాయి. ధరల శక్తిని తిరిగి పొందుతున్నాయి. వాల్యూవేషన్‌ వృద్ధి అవుట్‌లుక్‌ కూడా చాలా బాగుంది. ఆ అంశాల నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ షేర్లు ర్యాలీ చేసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు