కుప్పకూలిన ఫోర్టిస్‌ హెల్త్‌ కేర్‌ షేర్లు

15 Nov, 2019 12:43 IST|Sakshi

సాక్షి, ముంబై: సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ షేర్లు భారీగా కుప్పకూలాయి. జపాన్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ దైచీ శాంకో దాఖలు చేసిన  కేసులొ రాన్‌బ్యాక్సీ మాజీ  ప్రమోటర్లు మల్విందర్‌, శివిందర్‌ సింగ్‌లు తమ ఆదేశాన్ని ఉల్లంఘించి కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు సుప్రీం స్పష్టం చేసింది. ఇందుకు సోదరులిద్దరూ తలా 1,175 కోట్ల రూపాయలు జమ చేయాలని కోర్టు తెలిపింది.  అలాగే  ఫోర్టిస్‌ ఐహెచ్‌హెచ్‌ ఓపెన్ ఆఫర్‌పై స్టే ఎత్తివేయడానికి నిరాకరించింది. దీంతోపాటు ఫోర్టిస్‌కు వ్యతిరేకంగా సుమో మోటో ధిక్కార చర్యల్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. తదుపరి విచారణలో ఓపెన్‌ ఆఫర్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.  దీంతో శుక్రవారం నాటి  ట్రేడింగ్‌లో  ఫోర్టిస్‌ షేర్లు  52 వారాల గరిష్ట స్థాయి 161 రూపాయలను తాకిన తరువాత 17 శాతం పతనమయ్యాయి. 

అయితే ఫోర్టిస్‌ అనుబంధ సంస్థ ఎస్కార్ట్ హార్ట్ ఇన్సిస్టిట్యూట్ అండ్‌ రీసెర్చ్ సెంటర్ లిమిటెడ్ (ఇహెచ్‌ఆర్‌సిఎల్)కు అనుకూలంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చి స్వల్ప ఊరటనిచ్చింది. ఢిల్లీలోని  ఓఖ్లాలోనుంచి సంస్థను తొలగించే చర్యలను కోర్టు రద్దు చేసిందని కంపెనీ ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో తెలిపింది. కాగా 2005లో ఇహెచ్‌ఆర్‌సిఎల్ ఆసుపత్రి లీజును ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డిడిఎ) రద్దు చేయడంతో సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ రిట్‌ పిటిషన్ను 2006లో సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేసింది.  ఆ తరువాత మరోసారి సంస్థ దాఖలు చేసుకున్నస్పెషల్‌ లీవ్‌ పిటీషన్‌ను కూడా ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తిరస్కరించింది. 

మరిన్ని వార్తలు