పెట్రో షాక్‌ : ఆల్‌ టైం హైలో ఇంధన ధరలు

6 Sep, 2018 11:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం, ముడిచమురు ధరల భారంతో గురవారం పెట్రో ధరలు ఆల్‌ టైం హైకి చేరాయి. దేశ వాణిజ్యరాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రికార్డు స్ధాయిలో రూ. 86.91కు ఎగబాకింది. డీజిల్‌ లీటర్‌కు రూ. 75.96కు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ 21 పైసలు పెరిగి రూ. 84.30కు చేరింది. ఢిల్లీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటర్‌కు రూ. 79.51, రూ. 71.55కు పెరిగాయి.

అమెరికన్‌ డాలర్‌తో రూపాయి విలువ అత్యంత కనిష్టస్ధా‍యిలో రూ. 71కు పడిపోయిన ఆగస్ట్‌ 16 నుంచి ఇంధన ధరలు భారమవుతున్నాయి. మరోవైపు రూపాయి పతనంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇతర అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే రూపాయి నిలకడగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు. రూపాయిని స్ధిరీకరించేందుకు ఆర్‌బీఐ జోక్యంపై జైట్లీ మాట్లాడుతూ రూపాయి బలోపేతానికి ఆర్‌బీఐ అవసరమైన చర్యలు చేపడుతుందని చెప్పుకొచ్చారు.

>
మరిన్ని వార్తలు