అనిల్ అంబానీ ఆస్తులు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్.. జాబితాలో ఉన్నవేంటో తెలుసా?

14 Dec, 2023 18:02 IST|Sakshi

గత కొన్ని సంవత్సరాలకు ముందు ఇండియన్ టెలికాం రంగంలో పెను మార్పులు తీసుకువచ్చిన అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు చెందిన కొన్ని రియల్ ఎస్టేట్ ఆస్తులను విక్రయించేందుకు ముంబై ఎన్‌సిఎల్‌టి ట్రిబ్యునల్ ఆమోదం తెలిపినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్ ఇటీవల తెలిపింది.

రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్)కి చెందిన రిజల్యూషన్ ప్రొఫెషనల్ కంపెనీకి చెందిన కొన్ని అపరిమిత ఆస్తుల విక్రయాన్ని చేపట్టేందుకు ఎన్‌సిఎల్‌టి నుంచి అనుమతి కోరుతూ దాఖలు చేసిన దరఖాస్తు విషయంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ ఆర్డర్‌ను దాఖలు చేసింది.

ఈ ట్రిబ్యునల్ ఆమోదం కోసం రిజల్యూషన్ ప్లాన్‌ను సమర్పించిన తర్వాత CIRP రెగ్యులేషన్స్‌లోని రెగ్యులేషన్ 29 ప్రకారం దరఖాస్తుదారు/RP ​​కార్పొరేట్ రుణగ్రహీత ఆస్తులను విక్రయించవచ్చని ఈ ట్రిబ్యునల్ స్పష్టం చేస్తుంది.

విక్రయానికి ఎంచుకున్న ఆస్తులలో భూమి, భవనంతో కూడిన RCom చెన్నై హాడో ఆఫీస్ ఉన్నాయి. అంతే కాకుండా చెన్నైలోని అంబత్తూర్‌లో సుమారు 3.44 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్, పూణేలో 871.1 చదరపు మీటర్ల ల్యాండ్, భువనేశ్వర్ బేస్డ్ ఆఫీస్ స్పేస్, క్యాంపియన్ ప్రాపర్టీస్ షేర్లలో పెట్టుబడి, రిలయన్స్ రియల్టీ షేర్లలో పెట్టుబడి వంటివి విక్రయించనున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: బిలినీయర్స్ జాబితాలో కొత్త వ్యక్తి.. మద్యం అమ్ముతూ అరుదైన ఘనత

వాస్తవానికి 2016లో ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ప్రారంభించిన తర్వాత అనిల్ అంబానీ సంస్థ పరిస్థితి చాలా దిగజారింది. అన్న ప్రకటించిన డేటా వార్ కారణంగా తమ్ముడు భరించలేని నష్టాల్లోకి జారుకున్నాడు. ఆ విధంగానే కంపెనీ తన బ్యాంక్ రుణాలను చెల్లించటంలో డిఫాల్ట్ అయి చివరికి దివాలా ప్రక్రియలోకి వెళ్లిపోయినట్లు సమాచారం.

>
మరిన్ని వార్తలు