బంగారం ధరలకు ఫెడ్‌ షాక్‌

15 Jun, 2017 12:07 IST|Sakshi
బంగారం ధరలకు ఫెడ్‌ షాక్‌

న్యూఢిల్లీ:  వడ్డీరేట్లను పెంచుతూ అమెరికా  ఫెడ్‌  రిజర్వ్‌  నిర్ణయం తీసుకోవడంతో  అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారం ధరలు భారీ పతనాన్ని నమోదు చేస్తున్నాయి.   ఎంసీఎక్స్‌మార్కెట్‌ లో పుత్తడి ధరలు  గురువారం నీరసించాయి. మల్టీ కామోడిటీ ఎక్స్ఛేంజ్‌ ఆగస్టు డెలివరీ  బంగారు ధరలు భారీగా పడిపోయాయి.  పది గ్రా. పసిడి ధర  రూ.234 క్షీణించి రూ.28, 796 స్థాయిని నమోదు చేసింది. 

ఇటీవల కొన్ని సెషన్లుగా ఓలటైల్‌గా ఉన్న పసిడిధరలు  తాజాగా మరింత  దిగజారాయి. దీంతో రెండు నెలల కనిష్టాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయంగా ఔన్స్‌ బంగారం ధర 1.37 శాతం క్షీణించి 1,262.26  డాలర్లుగా ఉంది.అయితే వెండి ధరలు మాత్రం స్వల్పంగాపుంజుకున్నాయి. 0.01 శాతం పెరిగి 17 డాలర్లుగా నమోదైంది.  అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఇన్వెస్లర్ల ఆందోళన అమ్మకాలకు దారి తీస్తోందని ఎనలిస్టుల అంచనా.

అటు దేశీయస్టాక్‌మార్కెట్లు కూడా నెగిటివ్‌ గా ట్రేడ్‌ అవుతున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ 9600 స్థాయికి దిగువన కొనసాగుతోంది.  బుధవారం న్యూయార్క్‌  ఔన్స్ బంగారం ధర 0.47 శాతం తగ్గి 1,260.10 డాలర్లను నమోదు చేసింది. ప్రపంచ మార్కెట్లో బలహీన ధోరణి కారణంగా , ఫండ్స్ వర్తకంలో బంగారు ధరలు తగ్గుముఖం పట్టాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు కాగా  అంచనాలకు అనుగుణంగా అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఫండ్‌ రేటును పావుశాతం పెంచింది. అంతేకాదు ఈ ఏడాది  మరో సారి రేట్‌ కట్‌ తప్పదనే సంకేతాలు అందించిన  సంగతి తెలిసిందే.

 

మరిన్ని వార్తలు