మరింత తగ్గిన బంగారం ధర

8 Jul, 2017 16:46 IST|Sakshi
మరింత తగ్గిన బంగారం ధర

న్యూఢిల్లీ:  అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్‌ తగ్గడంతో  ధరలు ఇంకా దిగి వస్తున్నాయి.  డాలర్‌ బలం పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు డాలర్‌ పెట్టుబడులపై ఆసక్తి   చూపిస్తున్నారు. అటు స్థానిక నగల  వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో  విలువైన మెటల్ ధరలు మరింత పడిపోయాయి.   పది గ్రా.  బంగారం ధరలు  బలహీనంగా ఉన్నాయి. ఢిల్లీలో  పది గ్రాముల బంగారం ధర రూ .250 పడిపోయి రూ .28,900 కు చేరింది.

దేశ రాజధానిలో, 99.9% బంగారం, 99.5% స్వచ్ఛత గోల్డ్‌ రూ .250 చొప్పున పతనమై, 10 గ్రాముల ధర 28,900, రూ.28,750గా నమోదైంది.   కాగా శుక్రవారం రూ.220లు లాభపడింది. అయితే, సావరిన్ ఎనిమిది గ్రాముల బంగారం ధర రూ .24,400 వద్ద  స్థిరంగా ఉంది.

బంగారం బాటలోనే వెండి కూడా బలహీన ధోరణినే కనబరుస్తోంది.  కిలో వెండి ధర రూ .800 లు క్షీణించి రూ .37,400 కి చేరింది.  వారం రోజుల క్రితం కిలోకు రూ .920 కు రూ .36,230 కి చేరుకుంది. సిల్వర్ నాణెములు రూ.10000 లనుంచి రూ .71,000 కు పడిపోయాయి.  శుక్రవారం  ప్రపంచవ్యాప్తంగా బంగారం 1.04 శాతం పడిపోయి 1,212.20 డాలర్లకు చేరుకుంది. వెండి ధర 2.84 శాతం పెరిగి 15.57 డాలర్లకు చేరుకుంది. అటు ఎంసీఎక్స్‌ మార్కెట్‌ లో  కూడా పుత్తడి  భారీ పతనాన్నే నమోదు చేసింది. పది గ్రా.  పుత్తడి రూ.339 నష్టపోయి  రూ.27,777 వద్ద 28 వేల దిగువకు చేరడం గమనార్హం.

మరిన్ని వార్తలు