తగ్గింపుకు బ్రేక్‌ : పెరిగిన బంగారం ధరలు

9 Feb, 2018 17:27 IST|Sakshi
పెరిగిన బంగారం ధరలు (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : బంగారం ధరలు రెండు రోజుల నష్టాలకు బ్రేక్‌ పడింది. నేటి బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఒక్కసారిగా పైకి ఎగిశాయి. వచ్చే పెళ్లిళ్ల సీజన్‌లో డిమాండ్‌ను అందుకోవడం కోసం స్థానిక జువెల్లర్ల నుంచి తాజాగా కొనుగోళ్లు పెరుగడంతో, 10 గ్రాముల బంగారం ధర రూ.220 పెరిగి రూ.31,170గా నమోదైంది. వెండి ధరలు సైతం రికవరీ అయ్యాయి. రూ.330 మేర పెరిగిన వెండి నేటి మార్కెట్‌లో కేజీకి రూ.39,230గా రికార్డైంది. వెండికి కూడా పారిశ్రామిక యూనిట్లు, కాయిన్‌ తయారీదారుల నుంచి డిమాండ్‌ పెరిగింది. 

వచ్చే పెళ్లిళ్ల సీజన్‌లో డిమాండ్‌ను అందుకోవడం కోసం స్థానిక జువెల్లర్లు కొనుగోళ్లు చేపడుతున్నారని, అదేవిధంగా గ్లోబల్‌గా స్వల్పంగా ట్రెండ్‌ మెరుగుపడిందని దీంతో బంగారం, వెండి ధరలు రికవరీ అవుతున్నట్టు ట్రేడర్లు చెప్పారు. గ్లోబల్‌గా న్యూయార్క్‌లో బంగారం ధర 0.02 శాతం పెరిగి ఔన్స్‌కు 1,318.30 డాలర్లుగా నమోదైంది. దేశ రాజధానిలో 99.9, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.220 చొప్పున పెరిగి రూ.31,170గా, రూ.31,020గా నమోదయ్యాయి. గత రెండు సెషన్లలో ఈ ధరలు రూ.650 తగ్గాయి.

మరిన్ని వార్తలు