గూగుల్‌ మ్యాప్స్‌ లో అద్భుత ఫీచర్‌

5 Dec, 2017 19:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తాజాగా మరో అద్భుతమైన ఫీచర్‌ను  అందుబాటులోకి తీసుకొచ్చింది.  భారత్‌ వినియోగదారుల కోసం తన గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్‌కు గాను ఓ కొత్త ఫీచర్‌ను లాంచ్‌ చేసింది. గూగుల్‌ మూడవ ఎడిషన్‌ లో  వాయిస్ నావిగేషన్‌తో దీన్ని  మంగళవారం  లాంచ్‌ చేసింది.  టూవీలర్‌  సెగ్మెంట్‌లో  ప్రపంచంలో భారత్‌ ను అతిపెద్ద  మార్కెట్‌గా భావిస్తున్న గూగుల్‌  భారత్‌కోసం ప్రత్యేకంగా  గూగుల్ మ్యాప్స్‌లో ఈ ఫీచర్‌ను మొదటి సారిగా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు  గూగుల్‌ మాప్స్‌  డైరెక‍్టర్‌  మార్తా వెల్ష్ తెలిపారు.

టూ వీలర్ మోడ్ పేరిట విడుదలైన ఈ ఫీచర్ సహాయంతో   బైక్‌ రైడర్స్‌ గూగుల్ మ్యాప్స్ ద్వారా ప్రత్యేక ఆప్షన్‌ను పొందవచ్చు. ఈ ఫీచర్‌ టూ-వీలర్ డ్రైవర్లకు అత్యంత సరైన మార్గాన్ని మ్యాప్ చూపిస్తుంది. మ్యాప్స్‌లో కారు, ఫుట్, ట్రెయిన్ తదితర విభాగాల పక్కనే  ఇప్పుడు టూ వీలర్ ఆప్షన్‌ కూడా దర్శనమిస్తుందన్న మాట. దీన్ని ఓపెన్ చేస్తే టూ వీలర్ నడిపే వారి కోసం ప్రత్యేకంగా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ అవుతుంది. తద్వారా  వీరు  ఫాస్ట్‌గా వెళ్లేందుకు కావల్సిన  రూట్‌ను సులభంగా వెదుక్కోవచ్చు.  అంతేకాదు షార్ట్‌కట్ రూట్లను కూడా ఈ టూ వీలర్ మోడ్‌లో యూజర్లు పొందవచ్చు. దీంతో గమ్యస్థానానికి వేగంగా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.   దీన్ని అన్ని ప్లాట్‌ఫాంలకు చెందిన యూజర్లు పొందవచ్చనీ, ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో  విశ్వనీయంగా, కాన్ఫిడెంట్‌గా ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.

 

మరిన్ని వార్తలు