నో రిజిస్ట్రేషన్‌ ఫీజ్ ‌: కేంద్రం బంపర్‌ ఆఫర్‌

20 Jun, 2019 11:35 IST|Sakshi

ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు రిజిస్ట్రేషన్ చార్జెస్ రద్దు

ముసాయిదా నోటిఫికేషన్‌

సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ ఆధారిత  వాహనాల (ఎలక్ట్రిక్‌ వాహనాలు) పై  కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. ఎలక్ట్రిక్‌ వాహనాలపై  రిజిస్ట్రేషన్  ఫీజును  రద్దు చేయాలని  నరేంద్ర మోదీ  సర్కార్‌ ప్రతిపాదించింది.  ఈ మేరకు బుధవారం  ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది.   ఇందుకోసం సెంట్రల్ మోటర్ వెహికిల్స్ రూల్స్ (సీఎంవీఆర్) 1989 చట్టాన్ని సవరించినట్లు తాజా డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో రోడ్డు రవాణా  మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. బ్యాటరీతో నడిచే వాహనాలకు రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పింది. ఈ మేరకు నిబంధన 81లో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది.

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ విడుదల చేసిన ముసాయిదా ప్రకటన ప్రకారం పర్యావరణ హిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సాహమిచ్చే చర్యల్లో భాగంగా    కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాలుష్యం  ఉద్గారాలు వెదజల్లని ఈవీ వాహనాల వినియోగాన్ని భారీగా పెంచాలని  లక్ష్యంగా పెట్టుకుంది.  అలాగే  పదేళ్ల తర్వాత (2030) కేవలం ఎలక్ట్రిక్ వాహనాల  విక్రయాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని నీతి అయోగ్ కూడా సూచనలు చేసిందని తెలుస్తోంది.  

2030 నాటికి వాడకంలో విద్యుత్ వాహనాలే ఉండాలన్నదే లక్ష్యం. అలాఇందులో భాగంగానే విద్యుత్ ఆధారిత వాహనాల వైపు వాహనదారులు చూసేలా రిజిస్ట్రేషన్ చార్జీలను ఎత్తివేయాలని ప్రతిపాదించింది.  కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, పాత వాహనాల రెన్యువల్ కోసం కూడా ఎలాంటి చెల్లింపులు జరపనక్కర్లేదని స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ టూవీలర్లతో పాటు త్రీ వీలర్, ఫోర్‌ వీలర్ మిగతా అన్ని విద్యుత్ ఆధారిత వాహనాలకు ఇది వర్తిస్తుందని ప్రకటించింది. కాగా, తమ ఈ నిర్ణయంపై నెల రోజుల లోపు అభిప్రాయాలను తెలుపవచ్చని రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మీ బ్యాంకులను అడగండయ్యా..!

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ మరో భారీ కుంభకోణం 

ఇక రోబో రూపంలో ‘అలెక్సా’

ఐఫోన్‌ ధర రూ.40వేల దాకా తగ్గింపు

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

ప్రపంచ బ్యాంకు ఎండీ, సీఎఫ్‌వోగా అన్షులా

స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం

మీ భూమి చరిత్ర!!

ఇక విదేశాలకూ విస్తారా విమాన సర్వీసులు

మార్కెట్లోకి ‘ఇథనాల్‌’ టీవీఎస్‌ అపాచీ

ఇండస్‌ ఇండ్‌కు బీఎఫ్‌ఐఎల్‌ దన్ను

లాభాల్లోకి ట్రూజెట్‌!

మెప్పించిన ఇన్ఫీ!

ఇండిగోకు మరో షాక్ ‌

రీటైల్‌​ ద్రవ్యోల్బణం పైకి, ఐఐపీ కిందికి

38 శాతం ఎగిసిన ఇండస్‌ ఇండ్‌ లాభం

అదరగొట్టిన ఇన్ఫీ

చివరికి నష్టాలే

లాభనష్టాల మధ్య తీవ్ర ఒడిదుడుకులు 

సుజుకి జిక్సెర్‌ కొత్త బైక్‌..

పది విమానాలతో ట్రుజెట్‌ విస్తరణ

150 పాయింట్ల లాభం : 11600 పైకి నిఫ్టీ

హోండా ‘డబ్ల్యూఆర్‌–వీ’ కొత్త వేరియంట్‌

గూగుల్‌ మ్యాప్స్‌లో డైనింగ్‌ ఆఫర్లు

మెహుల్‌ చోక్సీ ఆస్తులు ఈడీ జప్తు

రుణ ప్రణాళికకు బ్యాంకర్లు ఓకే

రుణాల విషయంలో జాగ్రత్తగా ఉంటాం

భూముల అమ్మకంతో బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఊపిరి!

ఎయిరిండియాను అమ్మేసినా దేశీ సంస్థల చేతుల్లోనే

కళ్యాణి రఫేల్‌కు భారీ కాంట్రాక్టు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అమలాపాల్‌ ‘నగ్నసత్యాలు’  

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

అది మా అందరి వైఫల్యం

ఆగస్టులో ఎవరు

జాన్‌ ఎటాక్‌

ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు