5జీపై టెల్కోలతో టెలికం శాఖ భేటీ

1 Jan, 2020 03:50 IST|Sakshi

న్యూఢిల్లీ: వేగవంతమైన 5జీ సేవల ప్రయోగాత్మక పరీక్షలకు సంబంధించి టెల్కోలు, వివిధ ఉత్పత్తుల వెండార్లతో కేంద్ర టెలికం శాఖ (డాట్‌) మంగళవారం భేటీ అయ్యింది. టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్‌ సారథ్యంలో జరిగిన ఈ సమావేశం దాదాపు గంటపైగా సాగింది. ప్రయోగాత్మకంగా పరీక్షలు జరిపేందుకు హువావే సహా సంబంధిత సంస్థలన్నింటికీ 5జీ స్పెక్ట్రం కేటాయిస్తామంటూ కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ ప్రకటించిన నేపథ్యంలో తాజా సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. భద్రతాపరమైన కారణాల రీత్యా హువావేను అమెరికా నిషేధించిన సంగతి తెలిసిందే. 

మరోవైపు, వైర్‌లైన్‌ సేర్విసులు అందించే విషయంలో నెట్‌వర్క్‌ టెస్టింగ్‌కి సంబంధించి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ నిబంధనల ముసాయిదాపై చర్చాపత్రం విడుదల చేసింది. ఇందులో చాలా మటుకు ప్రతిపాదనలు మొబైల్‌ సరీ్వసు నెట్‌వర్క్‌ టెస్టింగ్‌ నిబంధనల తరహాలోనే ఉన్నాయి. వీటి ప్రకారం వ్యాపారపరంగా సరీ్వసులు ప్రారంభించేందుకు ముందుగా.. ట్రయల్‌ దశలో టెస్టింగ్‌ కోసం సబ్‌స్క్రయిబర్స్‌ను చేర్చుకునేందుకు టెలికం సంస్థకు అనుమతి ఉంటుంది. సబ్‌్రస్కయిబర్స్‌ను చేర్చుకోవడానికి కనీసం 15 రోజుల ముందు.. సదరు నెట్‌వర్క్‌ సామర్థ్యాల సమగ్ర వివరాలను డాట్‌కు ఆపరేటరు సమరి్పంచాల్సి ఉంటుంది. 

మరిన్ని వార్తలు