8వ నెలా హోండా పతనం

14 Jul, 2016 13:17 IST|Sakshi

జపనీస్ కారు తయారీదారు హోండా డీలర్స్ వరుసగా ఎనిమిది నెలల నుంచి చుక్కలు చూస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశీయ మార్కెట్లో హోండా అమ్మకాలు పడిపోతున్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సర ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశీయ ప్యాసెంజర్ వెహికిల్ అమ్మకాల్లో హోండా నాలుగో స్థానం నుంచి ఏడవస్థానానికి కిందకు జారింది. టాటా మోటార్స్, టయోటా, రెనాల్డ్ లు ఈ త్రైమాసికంలో ఎక్కువ కార్లను విక్రయించాయి. ఫెస్టివల్ డిమాండ్ తో 2015 అక్టోబర్ లో హోండాకు అమ్మకాలు అదుర్స్ అనిపించాయి. అయితే అప్పటినుంచి హోండా దేశీయ మార్కెట్లో తిరుగమనంలో పడింది.

2015 జూలైలో హోండా జాజ్ వెహికిల్ ను లాంచ్ చేయగా.. మేలో బీఆర్-వీని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. అయినా కూడా గత త్రైమాసికంలో 28శాతం అమ్మకాలు పడిపోయాయి. ఈ త్రైమాసికంలో కేవలం 31,487 వెహికిల్స్ ను మాత్రమే హోండా విక్రయించగలిగింది. స్టార్ సెడాన్, ది సిటీ అమ్మకాలు నిటారుగా పడిపోతూ.. హోండా అమ్మకాలను దెబ్బతీస్తున్నాయి. ఏప్రిల్-మే లో ది సిటీ కారు అమ్మకాలు 42శాతం పతనమై 9,098 వెహికిల్స్ గా నమోదయ్యాయి. అయితే దీనికి పోటీగా ఉన్న మారుతీ సుజుకీ సియాజ్ సెడాన్ మార్కెట్లో దూసుకెళ్తూ 12శాతం వృద్ధిని రికార్డుచేసింది.   

18 ఏళ్లకు చెందిన ఈ కారును చాలా సార్లు పునఃప్రారంభించారు. 2014 అక్టోబర్ లో సియాజ్ ను లాంచ్ చేశారు. దీంతో హోండాకు, మారుతీకి సీరియస్ పోటీ ప్రారంభమైంది. హోండా అమేజ్, బ్రియో అమ్మకాలు సైతం కంపెనీని నిరాశపరుస్తున్నాయి. గతేడాది సగటును నెలకు 4,600 వెహికిల్స్ అమ్మకాలు నమోదుచేసిన కొత్త జాజ్, ఈ ఏప్రిల్-మే త్రైమాసికంలో కేవలం 3,342 యూనిట్లనే అమ్మింది. దీంతో హోండా మార్కెట్ షేరు ఈ సగం ఏడాదిలో 5.6శాతానికి క్షీణించింది. 

డీజిల్ నుంచి అకస్మాతుగా పెట్రోల్ వైపుకు మరలడంతో హోండా వ్యాపారాలు దెబ్బతీశాయని కంపెనీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. అయితే మారుతీ సుజుకీ, హ్యుందాయ్ లు కూడా డీజిల్ కార్ల నుంచి పెట్రోల్ వైపు మరలాయని, కానీ వీటి అమ్మకాలపై ఎటువంటి ప్రభావం చూపలేదని ఆటో పరిశ్రమ నిపుణులంటున్నారు. అవి వాటి వృద్ధిని కొనసాగిస్తున్నాయని పేర్కొంటున్నారు.జేడీ పవర్ డీలర్ సంతృప్తికరమైన 2016 ఇండెక్స్ లో టయోటా, మారుతీ సుజుకీ, హ్యుందాయ్, రెనాల్డ్ ల తర్వాత హోండా ఐదో స్థానాన్ని దక్కించుకుంది. 2015 స్టడీలో హోండా మూడో స్థానంలో ఉంది.  
 

మరిన్ని వార్తలు