హోండా కార్ల ధరలు పెరుగుతున్నాయ్‌

22 Mar, 2017 00:51 IST|Sakshi
హోండా కార్ల ధరలు పెరుగుతున్నాయ్‌

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ హోండా కార్స్‌ ఇండియా (హెచ్‌సీఐఎల్‌) తాజాగా తన కార్ల ధరలను రూ.10,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరల పెంపు నిర్ణయం ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే కొత్తగా మార్కెట్‌లోకి తీసుకువచ్చిన డబ్ల్యూఆర్‌–వీ మోడల్‌ ధరలో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపింది.

ఉత్పత్తి వ్యయాలు పెరగడం, ముడిపదార్థాల ధరలు ఎగియడం వంటి పలు కారణాల నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో కార్ల ధరలు పెంచుతున్నామని హెచ్‌సీఐఎల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) జ్ఞానేశ్వర్‌ సేన్‌ తెలిపారు. హెచ్‌సీఐఎల్‌ రూ.4.69 లక్షలు–రూ.37 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ) కార్లను మార్కెట్‌లో విక్రయిస్తోంది. కాగా ఇటీవలే జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ కూడా ఏప్రిల్‌ నుంచి కార్ల ధరలను దాదాపు 2% పెంచుతున్నట్లు ప్రకటించింది.

మరిన్ని వార్తలు