కన్సల్టెన్సీ సేవల్లో హనీ గ్రూప్‌!

5 May, 2018 00:20 IST|Sakshi

200కు పైగా నిర్మాణ సంస్థలతో ఒప్పందం.. ఒకే చోట నివాస, వాణిజ్య ప్రాజెక్ట్‌లు

సాక్షి, హైదరాబాద్‌: కొనేటప్పుడు తక్కువ ధర.. అమ్మేటప్పుడు ఎక్కువ ధర రావాలని కోరుకునేది ఒక్క రియల్టీ రంగంలోనే! నిజమే, కొనుగోలుదారులెవరికైనా కావాల్సిందిదే. కస్టమర్ల అభిరుచికి తగ్గ ట్టుగా మార్కెట్‌ రేటు కంటే 3–5% తక్కువకు ప్రాపర్టీలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది హనీ గ్రూప్‌. మరిన్ని వివరాలు హనీ గ్రూప్‌ సీఎండీ ముక్కా ఓబుల్‌ రెడ్డి మాటల్లోనే..

♦  రెండేళ్ల క్రితం 9 మంది ఉద్యోగులతో విశాఖపట్నం కేంద్రంగా హనీ గ్రూప్‌ను ప్రారంభమైంది. ప్రస్తుతం 300 మంది ఉద్యోగులతో వైజాగ్‌తో పాటూ హైదరాబాద్, బెంగళూరు, గాజువాక ప్రాంతాల్లో 5 బ్రాంచీలకు విస్తరించాం. నిర్మాణ సంస్థలకు, కొనుగోలుదారులకు మధ్య కన్సల్టెన్సీ సేవలందించడమే హనీగ్రూప్‌ పని.

ప్రాపర్టీ కొనుగోలు చేసే కస్టమర్లకు ఎక్కడ కొంటే బెటర్, ధర ఎంత పెట్టొచ్చు, లోన్‌ వంటి అన్ని రకాల సేవలను అందిస్తాం. పైగా బిల్డర్‌కు ఇతరత్రా సర్వీస్‌లుంటాయి కాబట్టి మా ద్వారా వెళ్లిన కొనుగోలుదారులకు మార్కెట్‌ రేటు కంటే 3–5 శాతం ధర తక్కువుంటుంది. మరి, నిర్మాణ సంస్థలకేం లాభమంటే.. మార్కెటింగ్, సైట్‌ విజిట్, కస్టమర్లను ఒప్పించడం వంటి వాటి కోసం ప్రత్యేక సిబ్బంది అవసరముండదన్నమాట.

ఒకే చోట 360 ప్రాజెక్ట్‌లు..
ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం వంటి పలు నగరాల్లో 203 నిర్మాణ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. దక్షిణాది రాష్ట్రాల్లో 360కి పైగా ప్రాజెక్ట్‌లున్నాయి. పూర్వాంకర, ప్రెస్టీజ్, శోభ, బ్రిగేడ్, ఎంబసి, అంబిక, ఎంవీవీ, జైన్, వైజాగ్‌ ప్రొఫైల్, ఫ్లోరా వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు మా కస్టమర్లుగా ఉన్నారు. గత రెండేళ్లలో 1,200కు పైగా ప్రాపర్టీలను విక్రయించాం.

రెండేళ్లలో వెయ్యి మందికి ఉద్యోగాలు..
పెద్ద నోట్ల రద్దు సమయంలో చాలా రియల్టీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తే హనీగ్రూప్‌ మాత్రం ఏకంగా 200 మంది ఉద్యోగులను నియమించుకుంది. పైగా 4 కొత్త బ్రాంచీలను ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది కాలంలో తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, భువనేశ్వర్, చెన్నై ప్రాంతాల్లో బ్రాంచీలను ప్రారంభించాలని నిర్ణయించాం. రెండేళ్లలో 1,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని లకి‡్ష్యంచాం.

మరిన్ని వార్తలు