చాట్‌జీపీటీకి పోటీగా అమెజాన్‌ చాట్‌బాట్‌ ‘క్యూ’ విడుదల.. కానీ

29 Nov, 2023 20:01 IST|Sakshi

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ జనరేటీవ్‌ ఏఐ చాట్‌బాట్‌ అమెజాన్‌ ‘క్యూ’ ని లాంచ్‌ చేసింది. చాట్‌జీటీపీని పోలి ఉండే ఈ చాట్‌బాట్‌ వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహించేందుకు వీలుగా ఉంటుంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌లు తమ ప్రొడక్ట్‌లలో జనరేటీవ్‌ ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తుండగా.. తాజాగా అమెజాన్‌ సైతం క్యూ చాట్‌బాట్‌ని అందుబాటులోకి తేవడం గమనార్హం. 

అమెజాన్‌ క్యూ 'కొత్త రకం జనరేటివ్ ఏఐ- పవర్డ్ అసిస్టెంట్'గా పరిచయం చేస్తుంది. ఇది ఉద్యోగుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో పాటు కంపెనీ డేటాను ఉపయోగించి కంటెంట్‌ను రూపొందిస్తుంది.  

‘‘మీ వ్యాపారానికి అనుగుణంగా పని చేయడానికి రూపొందించబడింది. మీరు మీ కంపెనీ సమాచార రిపోజిటరీలు, కోడ్, డేటా, ఎంటర్‌ప్రైజ్ సిస్టమ్‌లకు కనెక్ట్ చేయడం ద్వారా సంభాషణలు, సమస్యలను పరిష్కరించడానికి, కంటెంట్‌ను తయారు చేయొచ్చు. 

అంతేకాదు అమెజాన్‌ క్యూ ఉద్యోగులకు పనులను క్రమబద్ధీకరించడానికి, నిర్ణయాలు తీసుకోవడంతో పాటు సమస్యల పరిష్కారాల్ని వేగవంతం చేయడానికి, పనిలో సృజనాత్మకత, ఆవిష్కరణల కోసం ఉద్యోగులకు తక్షణ, సంబంధిత సమాచారం, సలహాలను అందిస్తుంది" అని అమెజాన్‌ తన బ్లాగ్‌ పోస్ట్‌లో పేర్కొంది. 
 

మరిన్ని వార్తలు