ఏ ఏటీఎంలో క్యాష్ ఉందో చెప్పే..‘వాల్ నట్’ యాప్!

16 Nov, 2016 01:10 IST|Sakshi
ఏ ఏటీఎంలో క్యాష్ ఉందో చెప్పే..‘వాల్ నట్’ యాప్!

హైదరాబాద్: పర్సనల్ ఫైనాన్‌‌స మేనేజ్‌మెంట్ యాప్ వాల్‌నట్ మార్కెట్లో ఉన్న నగదు కొరత సమస్యకు పరిష్కారంగా ఓ సౌకర్యాన్ని తన యాప్‌కు జత చేసింది. దీని ద్వారా 18 లక్షల మంది వాల్‌నట్ యూజర్లు సమీపంలో ఏ ఏటీఎంలో నగదు ఉందో తెలుసుకునే వీలుంది. అత్యవసరంగా నగదు కావాల్సిన వారు తమ సమీప ప్రాంతాల్లోని అన్ని ఏటీఎం లను చుట్టేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం కనిపిస్తూనే ఉన్నారుు. వాల్‌నట్ యూజర్ ఎవరైనా ఏటీఎంలో నగదు తీసుకుంటే ఆ ఏటీఎం, అక్కడ క్యూలో ఎంత మంది ఉన్నారు వంటి వివరాలను వాల్‌నట్ యాప్ వారి నుంచి సేకరిస్తుంది. తక్కువ క్యూ ఉన్న ఏటీఎంలు, ఎక్కువ క్యూ ఉన్నవి, నగదు లేని ఏటీఎంలను గ్రీన్, ఆరెంజ్, గ్రే రంగుల్లో సూచిస్తుంది.

మరిన్ని వార్తలు