వచ్చే ఏడాది వేతనాల పెంపు ఎంతంటే...

9 Nov, 2017 19:04 IST|Sakshi

వచ్చే ఏడాది భారత్‌లో వేతనాలు పెంపు 10 శాతం వరకు ఉంటుందని తాజా రిపోర్టు వెలువరించింది. ఆసియా-పసిఫిక్‌ రీజన్‌లో అన్ని దేశాలతో పోలిస్తే భారత్‌లోనే అత్యధిక మొత్తంలో ఈ పెంపు ఉంటుందని తెలిసింది. 2017లో కూడా ఇంతే మొత్తంలో పెంపు ఉన్నట్టు రిపోర్టు వెల్లడించింది. గ్లోబల్‌ అడ్వయిజరీ, బ్రోకింగ్‌, సొల్యుషన్స్‌ కంపెనీ విల్లిస్ టవర్స్ వాట్సన్ విడుదల చేసిన 2017 క్యూ3 శాలరీ బడ్జెట్‌ ప్లానింగ్‌ రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. వేతనాల పెంపు కూడా అత్యధికంగా ఎనర్జీ, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌ రంగాల్లో చూస్తామని రిపోర్టు తెలిపింది.

బీపీఓ, కెమికల్స్‌, కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ అండ్‌ రిటైల్‌, ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, హైటెక్‌, మానుఫాక్ట్ర్చరింగ్‌, మీడియా, ఫార్మాస్యూటికల్‌ అండ్‌ హెల్త్‌ సైన్సెస్‌, బిజినెస్‌, టెక్నికల్‌ కన్సల్టింగ్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌, లాజిస్టిక్స్‌ రంగాలను ఈ రిపోర్టు కవర్‌ చేసింది. ఆసియా పసిఫిక్‌లో 4000 మంది జూన్‌లో ఈ సర్వేను చేపట్టింది. భారత మార్కెట్‌ నుంచి 300 కంపెనీలు ఈ సర్వేలో పాల్గొన్నాయి.

అయితే ఏడాది ఏడాది పెరుగుతున్న కొద్దీ వేతనాల పెంపు కాస్త తక్కువగానే ఉంది. అయినప్పటికీ ఆసియా పసిఫిక్‌ రీజన్‌లో భారతే ముందంజలో ఉందని రిపోర్టు వెల్లడించింది. ఇతర దేశాలను చూస్తే ఇండోనేషియాలో 8.5 శాతం, చైనాలో 7 శాతం, ఫిలిప్పీన్స్‌లో 6 శాతం, హాంకాంగ్‌, సింగపూర్‌లో 4 శాతం పెంపును చూడొచ్చని ఈ రిపోర్టు తెలిపింది. ఆసియా-పసిఫిక్‌ రీజన్‌లోని దేశాలతో పోలిస్తే భారత్‌లో వేతనాల పెంపు చేపడుతూనే ఉందని, అయితే 2011 నుంచి తొలిసారి 2018లో సింగిల్‌ డిజిట్‌లో వేతనాల పెంపును చూడనున్నామని విల్లిస్‌ టవర్స్‌ వాట్సన్‌ డేటా సర్వీసెస్‌ ప్రాక్టిస్‌ లీడర్‌, ఆసియా పసిఫిక్‌, సంభవ్‌ రక్యాన్‌ అన్నారు. 
 

మరిన్ని వార్తలు