ఇన్ఫీ మధ్యంతర సీఎఫ్‌వోగా జయేశ్ సంఘ్రజ్క

15 Nov, 2018 20:10 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ తన లీడర్‌షిప్‌లో కీలక మార్పునుచేపట్టింది. సంస్థ మధ్యంతర ముఖ్య ఆర్థిక అధికారిగా (సీఎఫ్‌వో)గా జయేశ్ సంఘ్రజ్కాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ‍ జయేశ్‌  మధ్యంతర  సీఎఫ్‌ఓ, అలాగే కీలక నిర్వాహక అధికారిగా ఉంటారని ఇన్ఫోసిస్‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలియజేసింది. ఈ నియమాకం నవంబరు 17, 2018 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. జయేశ్‌ ఇన్ఫోసిస్‌లో ప్రస్తుతం  ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ,  డిప్యూటీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా ఉన్నారు.

కాగా ప్రస్తుత ఎండీ, సీఎఫ్‌వో రంగనాథ్‌ రేపు (నవంబర్ 16) కంపెనీని వీడినున్నారు.  18 సంవత్సరాలు ఇన్ఫీకి  సేవలందించిన రంగనాథ్‌ (రంగ) ఈ ఏడాది ఆగస్టులో రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఇన్ఫోసిస్ బోర్డు అంగీకరించింది.    

మరిన్ని వార్తలు