ఇంటెల్‌ యూజర్లకు వార్నింగ్‌

23 Jan, 2018 14:21 IST|Sakshi

ప్రపంచంలోని అతిపెద్ద చిప్ తయారీ సంస్థ ఇంటెల్ కార్ప్ వినియోగదారులను విస్మయానికి గురిచేసే  వార్త చెప్పింది. ఇటీవల రిలీజ్‌ చేసిన సిస్టం అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. తాము విడుదల చేసిన అప్‌డేటెడ్‌ పాచెస్‌లో లోపాలు ఉన్నట్టు వెల్లడించింది.  తన చిప్‌లో  రెండు  హై-భద్రతా ప్రమాదాలను పరిష్కరించేందుకు విడుదల చేసిన పాచెస్ ప్రమాదకరమైనవని,  కనుక అప్‌డేట్‌ చేసుకోవద్దని హెచ్చరించింది. వీటిని ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దంటూ వినియోగదారులు,  కంప్యూటర్  తయారీదారులు,  క్లౌడ్ ప్రొవైడర్లకు   కీలక సూచనలు జారీ చేసింది.

చిప్‌ మేకర్‌ వెబ్‌సైట్‌లో  ఇంటెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నవిన్ షెనోయ్  ఈ విషయాన్ని ప్రకటనలో వెల్లడించారు.  ఈ సందర్భంగా ఆయన ఇంటెల్‌ యూజర్లకు క్షమాపణలు చెప్పారు.   త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించనున్నామని  హామీ ఇచ్చారు.   దీనికోసం 24 గంటలుపనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇంటెల్‌ వైఫ్యలం  కంప్యూటర్ల వ్యాపారంపై  ప్రభావం పడనుందని ఐడీసీ ఎనలిస్ట్‌ మారియో మోరేల్స్‌ వ్యాఖ్యానించారు.  సంబంధిత పాచ్‌ను విడుదల చేయడంలో జరుగుతున్న జాప్యం కొనుగోళ్లపై పడుతుందన్నారు.
స్పెక్ట్రే అండ్ మెల్ట్‌డౌన్‌ అని పిలవబడే   ఫాల్టీ పాచెస్‌  ప్రభావానికిగురైన  తన చిప్‌లో లోపాలు ఉన్నాయని ధృవీకరించిన దాదాపు మూడు వారాల తరువాత ఈ హెచ్చరిక చేసింది. అలాగే కొత్త వెర్షన్‌ను పరీక్షించాలని టెక్నాలజీ ప్రొవైడర్లను కోరింది.

మరిన్ని వార్తలు