జీప్ మోస్ట్ అఫార్డబుల్ ఎస్యూవీ, ధరెంతంటే...

12 Apr, 2017 16:28 IST|Sakshi
జీప్ మోస్ట్ అఫార్డబుల్ ఎస్యూవీ, ధరెంతంటే...
న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన ఫేమస్ ఆటోమొబైల్ బ్రాండు జీప్, ఎట్టకేలకు తన మేడిన్ ఇండియా మోస్ట్ అఫార్డబుల్ ఎస్యూవీని భారత్ లో ప్రవేశపెట్టింది. జీప్ కంపాస్ ను బుధవారం మార్కెట్లోకి తీసుకొచ్చింది. గతేడాది అంతర్జాతీయంగా లాంచ్ అయిన ఈ జీప్ కంపాస్, హ్యుందాయ్ టక్సన్, హోండా సీఆర్-వీలకు గట్టి పోటీనిచ్చేందుకు మార్కెట్లోకి వచ్చింది.  మహారాష్ట్రలోని రంజన్‌గావ్‌లో ఉన్న ఫియట్ ఆటోమొబైల్స్ కేంద్రంలో దీన్ని రూపొందించారు. రైట్-హ్యాండ్-డ్రైవ్ జీప్ కంపాస్ తయారీకి కేవలం ఈ ఒక్క తయారీ కేంద్రమే భారత్ లో ఉంది. ఈ కంపాస్ ధర రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.
 
ఇది 56 లక్షల ధర కలిగిన వ్రాంగ్లర్, 93 లక్షల ధర కలిగిన గ్రాండ్ చెరోకి ధర కంటే చాలా తక్కువగా ఉండబోతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్లో నిలదొక్కుకోవడానికి అఫార్డబుల్ ధరలోనే జీప్ కంపాస్ ను తీసుకొస్తున్నామని కంపెనీ కూడా చెబుతోంది. ధర విషయాన్ని పక్కనబెడితే, ఈ ఎస్యూవీ 1.4 లీటర్ పెట్రోల్, 2.0 లీటర్ డీజిల్ ఆప్షన్లను కలిగి ఉంది. సిక్స్ స్పీడు మాన్యువల్ లేదా సెవన్ స్పీడ్ ఆటో బాక్స్ ను ఇది  ఆఫర్ చేస్తోంది. ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ను ఇది కలిగి ఉంది. స్నో, శాండ్, రాక్ ఆప్షన్ డ్రైవింగ్ మోడ్స్ తో పవర్ డెలివరీ, డ్రైవ్ డైనమిక్స్ ను మార్చుకోవచ్చు.
 
ఎల్ఈడీ డీఆర్ఎల్స్, హెడ్ లైట్స్, బ్లాక్ రూఫ్ ఆప్షన్, సేఫ్టీ కోసం 50 ప్లస్ సెక్యురిటీ ఫీచర్లను దీనిలో పొందుపరచింది. ఆరు ఎయిర్ బ్యాగులతో ఇది రూపొందించింది. ఈ కంపాస్ లోని ఇతర సేఫ్టీ ఫీచర్లు.. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటివి కలిగి ఉన్నాయి. నలుపు లేత గోధుమరంగులో ఇంటీరియర్స్ కలిగి ఉండబోతుంట.  ఆపిల్ కారు ప్లే, గూగుల్ ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లను సపోర్టు చేసేలా ఏడు అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో దీన్ని రూపొందించారు.  
మరిన్ని వార్తలు