చిన్న పరిశ్రమలకు రుణం అందడంలేదు

20 Nov, 2014 01:11 IST|Sakshi
చిన్న పరిశ్రమలకు రుణం అందడంలేదు

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు కనీసం రూ.కోటి రుణాన్ని కూడా బ్యాంకులు ఇవ్వడంలేదని కేంద్ర సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్రాజ్ మిశ్రా అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు రుణాలివ్వాలనే రిజర్వుబ్యాంకు నిబంధనలను సైతం బ్యాంకర్లు పక్కన పెడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో కొత్తగా స్మూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఒరవడి లేదని చెప్పారు.

  ‘ సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల కోసం ఆర్ధిక పునర్మాణం-విజయానికి జీవన రేఖ’ అంశంపై ఢిల్లీలో బుధవారం అసోచామ్ నిర్వహించిన సదస్సులో కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా మాట్లాడారు. దేశంలో స్మూక్ష, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. సమస్యలను అధిగమించడానికి ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన చర్యలతో ప్రపంచ దేశాల దృష్టికి ఇప్పుడు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలవైపు పడిందని చెప్పారు.

 గోదావరి పాలిమర్స్‌కు అవార్డు
 తక్కువ వ్యయంతో అధిక మేలు చేసే ఉత్పత్తుల తయారీ సంస్థల విభాగంలో గోదావరి పాలిమర్స్ సంస్థ డెరైక్టర్ సి.రాజేంద్ర కుమార్‌కు ఈ సందర్భంగా  అవార్డు ప్రధానం జరిగింది. ఈ సందర్భంగా రాజేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతూ గోదావరి పాలిమర్స్ సంస్థ ద్వారా సంప్రదాయకమైన వ్యసాయ ఉత్పత్తులు తయారు చేస్తూ రైతులకు చేస్తున్న సేవలకు గాను ఈ అవార్డు లభించిందని, దీంతో తమ సంస్థ బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు.

మరిన్ని వార్తలు