పిడికెడు ‘భయం’

20 Nov, 2014 01:06 IST|Sakshi
పిడికెడు ‘భయం’

 ‘శిక్ష’ అనే భయం నెత్తి మీద కత్తిలాగ నిలవకపోతే నేరస్థుడి గ్లామరు ఎంతటి విశ్వరూపం దాలుస్తుందో అర్థశతాబ్ది కిందనే నిరూపించిన అందమైన, అపురూపమైన హంతకుని కథ ఇది.
 
 భయం చాలా ముచ్చటై న జబ్బు. మరో విధంగా భయం చాలా అవసర మైన ఔషధం. అక్రమాన్ని చేసేవాడికి శిక్ష హెచ్చరిక. శిక్ష సమాజం సాధికారి కంగా నేరస్థుడికి లోను చేసే హింస. ‘శిక్ష’ని ఏనా డయినా మనం ఈ దృష్టి తో ఆలోచించామా? దీనికి న్యాయస్థానం మద్దతు ఉంది. విచిత్రం కదూ!
 
 నేరస్థుడి మీద శిక్షని ఏమీ సానుభూతి చూప కుండా విధించాలని మొన్న సుప్రీం కోర్టు న్యాయ మూర్తి జస్టిస్ ఎమ్.వై. ఇక్బాల్ అన్నారు. విధించక పోతే? నేరస్థుడి చేతుల్లో నష్టపోయినవారికి నేరస్థుడి పట్ల వ్యక్తిగతమయిన ప్రతీకార వాంఛ పెరుగుతుం దన్నారు. కానీ నేను న్యాయమూర్తిగారితో పూర్తిగా ఏకీభవించలేకపోతున్నాను. కారణం- మరొకటి కూ డా పెరుగుతుంది. నేరం పట్ల గ్లామరు. ఇది ఫిర్యాది ప్రతీకార వాంఛ కన్నా మిక్కిలి అనర్థమయినది.
 
 నేరం మెరుపు. ఆకర్షిస్తుంది. ఆశ్చర్యపరుస్తుం ది. అదాటుగా ఉంటే ఆనందపరుస్తుంది. నిజానికి నేటి వినోదానికి దొంగ పేరు ‘హింస’.
 
 నేను ఓ దినపత్రికలో పనిచేసే తొలిరోజుల్లో (1960) ఓ గొప్ప నేరస్థుడు, హంతకుడు, మానభం గాలు చేసిన దుర్మార్గుడు పట్టుబడ్డాడు. అతనికి ఆ రోజుల్లో వచ్చినంత పాపులారిటీ ప్రపంచంలో ఏ మైకేల్ జాక్సన్‌కో, ఏ మహమ్మదాలీకో వచ్చి ఉం టుంది. అతని పేరు - కారిల్ చెస్‌మెన్. నేరానికి ఆ ‘రుచి’ ఉంది.
 
 కాలిఫోర్నియా చట్టం ప్రకారం అతనికి వేసిన ఉరిశిక్ష చెల్లదని మీమాంస లేచింది. అయితే మేరి ఆలిస్ మెజా అనే 17 ఏళ్ల అమ్మాయిని చెస్‌మెన్ ఆమె కారు నుంచి తన కారుకి 20 గజాలు ఈడ్చుకెళ్లాడు. 20 గజాలు ఈడ్చుకెళ్లిన నేరం ‘ఎత్తుకెళ్లిన నేరం’ కింద పరిగణించి అతనికి మరణశిక్ష విధించారు. అతను 12 ఏళ్లు జైల్లో మరణ శిక్ష అమలుకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అతను పట్టుబడే నాటికి 27 ఏళ్లు. మరణశిక్ష అమలు జరిగే నాటికి 39. అతని కథ ప్రపంచంలో పెద్ద సంచలనం.
 
 ఒక దశలో ప్రపంచంలో ఎందరో మేధావులు, రచయితలు, మత గురువులు అతన్ని క్షమించాలని విజ్ఞప్తులు చేశారు. అలా పంపినవారిలో ఆల్డస్ హక్సి లీ, రాబర్ట్ ఫ్రాస్ట్, నార్మన్ మైలర్, మతగురువు బిల్లీ గ్రాహం, అమెరికా అధ్యక్షుడు ఎఫ్.డి. రూజ్‌వెల్ట్ భార్య ఎలినార్ రూజ్‌వెల్ట్ ఉన్నారు.
 
 కాలిఫోర్నియా గవర్నర్ పాట్ బ్రౌన్ ఎన్నో సార్లు అతని మరణ శిక్ష వాయిదా వేశారు. చట్టం ప్రకారం ఇక వాయిదా వేసే దశలన్నీ దాటాక 1961 నవంబర్ 2న ఆయన్ని గ్యాస్‌చాంబర్‌లో కూర్చోబెట్టి విషవాయువు (హైడ్రోజన్ మోనాక్సైడ్)ను వది లారు. ఈలోగా న్యాయమూర్తి మళ్లీ శిక్ష వాయిదా వేసినట్టు ఆయన కార్యదర్శి హడావుడిగా జైలుకి ఫోన్ చేసింది. కాని అప్పటికే విషవాయువు నేర స్థుడి గదిలో వ్యాపిస్తున్నది. ఇక ఆపడం సాధ్యం కాదన్నాడు జైలర్. జరిగిందేమిటంటే శిక్ష ఆపాలన్న వార్త చె ప్పాలన్న ఆతృతలో కార్యదర్శి మొదటి కాల్ తప్పుగా చేసింది. ఆ ఆలస్యం కారణంగా వేళ మించి పోయింది. చెస్‌మెన్ మరణించాడు.
 
 ఈ 12 ఏళ్లలో చెస్‌మెన్ జైల్లో కూర్చుని 4 పుస్త కాలు రాశాడు. ‘సెల్ 2455, మరణ శిక్ష’ అనే ఆత్మ కథ లక్ష కాపీలు అమ్ముడుపోయింది (అజ్మల్ కసబ్ ఆత్మకథ రాసివుంటే సచిన్ తెందూల్కర్ పుస్తకానికి దీటుగా అమ్ముడుపోయేది). కొలంబియా పిక్చర్స్ 1955లో ఆ సినిమాను తీసింది. అప్పటికింకా చెస్ మెన్ బతికే ఉన్నాడు. సినిమా పెద్ద హిట్. 1957లో ‘ది ఫేస్ ఆఫ్ జస్టిస్’ అనే నవల, ‘ది కిడ్ వాజ్ కిల్లర్’ అనే నవల కూడా రాశాడు. 1977లో ఎన్‌బీసీ టెలివి జన్ అతని జీవితాన్ని సీరియల్ చేసింది. అది గొప్ప విజయాన్ని సాధించింది. ‘ది బాలెడ్ ఆఫ్ చెస్‌మెన్’ పేరిట ప్రముఖ గాయకుడు రోనీ హాకిన్స్ ‘లెట్ హిం లివ్, లెట్ హిం లివ్, లెట్ హిం లివ్’ (అతన్ని బతక నివ్వండి) అనే పాట రాశాడు. నేరాలు చెయ్యడానికి చెస్‌మెన్ వాడిన ఫ్లాష్‌లైట్, ఎర్ర ముసుగు బ్రెజిల్‌లో పిచ్చిగా పాపులర్ అయ్యాయి.
 
 అన్నిటికన్నా ఈ నేరస్థుడి పాపులారిటీకి కలికి తురాయి ఏమిటంటే అమెరికా ‘టైమ్’ మాగజైన్ అతని ముఖచిత్రంతో ఒక సంచికను విడుదల చేసిం ది. ఈ గౌరవాన్ని లోగడ పంచుకున్న నలుగురు మహానుభావుల పేర్లు - మహాత్మాగాంధీ, మదర్ థెరిస్సా, నెల్సన్ మండేలా, సచిన్ తెందూల్కర్. ఆయా దేశాలలో విలువలకీ మోజుకీ పొంతన లేదు.
 
 ‘శిక్ష’ అనే భయం నెత్తి మీద కత్తిలాగ నిలవ కపోతే నేరస్థుడి గ్లామరు ఎంతటి విశ్వరూపం దాలు స్తుందో అర్థ శతాబ్ది కిందనే నిరూపించిన అంద మైన, అపురూపమైన హంతకుని కథ ఇది. కనుక న్యాయమూర్తి ఇక్బాల్ గారి మాట చాలా సబబైనది.
 
 గొల్లపూడి మారుతీరావు: వ్యాసకర్త సుప్రసిద్ధ రచయిత, నటుడు
 

మరిన్ని వార్తలు