పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించిన ప్రభుత్వం

17 Sep, 2018 11:37 IST|Sakshi
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గింపు (ఫైల్‌ ఫోటో)

బెంగళూరు : పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కర్నాటక ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. పెరుగుతున్న ధరలను నుంచి వినియోగదారులకు విముక్తి కల్పించేందుకు లీటరు పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై రెండు రూపాయలను తగ్గించింది. తాము తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు కొంతమేర ఊరట కలిగించనుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్‌ ధర 90 రూపాయలను క్రాష్‌ చేస్తోంది.

‘ప్రతిరోజు ఇంధన ధరలు పెరుగుతున్నాయి. కర్నాటక రాష్ట్ర ప్రజలు, పన్నులు తగ్గి, ధరలు తగ్గితే బాగుండని భావించారు. కుల్బర్గి నుంచి ప్రకటిస్తున్నా.. మా సంకీర్ణ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై కనీసం రెండు రూపాయల పన్నులను తగ్గించాలని నిర్ణయించింది. మా సంకీర్ణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, కర్నాటక ప్రజలకు కాస్త ఊరటనిస్తుందని భావిస్తున్నాం’ అని కుమారస్వామి తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌, రాజస్తాన్‌ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇంధన ధరలను లీటరుకు రెండు రూపాయలు, రెండున్నర రూపాయలు తగ్గించాయి. కాగా.. సోమవారం కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుదలనే నమోదు చేశాయి. న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.82.06గా, కోల్‌కతాలో రూ.83.91గా, ముంబైలో రూ.89.44గా, చెన్నైలో రూ.85.31గా, బెంగళూరులో రూ.84.74గా ఉంది. డీజిల్‌ ధర కూడా న్యూఢిల్లీలో లీటరు రూ.73.78గా, కోల్‌కతాలో రూ.75.63గా, ముంబైలో రూ.78.33గా, చెన్నైలో రూ.78గా, బెంగళూరులో రూ.76.16గా రికార్డైంది.    
 

>
మరిన్ని వార్తలు