టెకీల కోసం... లేటెస్ట్

15 May, 2015 01:55 IST|Sakshi
టెకీల కోసం... లేటెస్ట్

టెక్నాలజీ ఉపకరణాల్ని మాత్రమే విక్రయిస్తున్న లేటెస్ట్‌వన్.కామ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ మార్కెట్ 2013-14 నాటికి రూ.30 వేల కోట్లకు చేరింది. అయితే దీన్లో టెక్నాలజీ ఉపకరణాల వాటా రూ.2 వేల కోట్లుగా ఉంటుంది. ఇది చాలు... ఆన్‌లైన్లో టెక్ ఉత్పత్తుల డిమాండ్ తెలియజేయడానికి. అందుకే కేవలం టెక్నాలజీ ఉపకరణాలను మాత్రమే విక్రయించేందుకు లేటెస్ట్‌వన్.కామ్‌ను ఆరంభించామన్నారు సంస్థ సీఈఓ అమీన్ ఖ్వాజా. గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో సంస్థ విస్తరణ ప్రణాళికలు వివరించారాయన. అవి...
     
- సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, చార్జర్లు, కేబుల్స్ వంటి టెక్నాలజీ ఉపకరణాల విక్రయానికి రూ.30 కోట్ల పెట్టుబడితో గత ఆగస్టులో లేటెస్ట్‌వన్.కామ్‌ను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం దీన్లో 8 వేల వరకు వివిధ రకాల ఉత్పత్తులున్నాయి. రోజుకు రూ.11-12 లక్షల విలువ చేసే 2,500 ఆర్డర్లొస్తున్నాయి. వీటిలో సెల్‌ఫోన్ యాక్ససరీల వాటా ఎక్కువ.
- ఇతర ఈ-కామర్స్ సైట్లకు మాకూ ఉన్న ప్రధాన తేడా ఏంటంటే.. విక్రయించే వస్తువుల్లో 75 శాతం ఉత్పత్తులు సొంత బ్రాండ్ పీ-ట్రాన్‌వే. చైనాకు చెందిన మూడు తయారీ సంస్థలతో ఒప్పందం చేసుకుని అవి తయారు చేసిన వస్తువుల్నే విక్రయిస్తున్నాం. దీంతో ధర తక్కువగా ఉంటోంది. మార్జిన్లూ ఎక్కువే ఉన్నాయి.

మరిన్ని వార్తలు