ఎల్‌ఐసీ నుంచి జీవన్‌ అమర్‌

6 Aug, 2019 12:52 IST|Sakshi

జీవిత బీమా రంగంలోని అగ్రగామి సంస్థ ఎల్‌ఐసీ నాన్‌ లింక్డ్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని ‘జీవన్‌ అమర్‌’ పేరుతో తీసుకొచ్చింది. ఆఫ్‌లైన్‌లో లభించే ఈ ప్లాన్‌లో రెండు రకాల మరణ పరిహార ప్రయోజనాల్లో నచ్చిన దానిని ఎంచుకోవచ్చని సంస్థ తెలిపింది. పాలసీ కాల వ్యవధి వరకు ఒకటే సమ్‌ అష్యూర్డ్‌ (లెవల్‌ సమ్‌ అష్యూర్డ్‌) ఒకటి అయితే, సమ్‌ అష్యూర్డ్‌ (బీమా) నిర్ణీత కాలానికోసారి పెరుగుతూ వెళ్లేది రెండో ఆప్షన్‌. రెండో ఆప్షన్‌లో ఆరో ఏట నుంచి ఆ తర్వాత పదేళ్ల వరకు ఏటా 10 శాతం చొప్పున సమ్‌ అష్యూరెన్స్‌ రెట్టింపు అయ్యే వరకు పెరుగుతూ వెళుతుంది. 18–65 ఏళ్ల మధ్య ఉన్న వారు ఎవరైనా ఈ పాలసీ తీసుకునేందుకు అర్హులే. గరిష్టంగా 80 ఏళ్ల వయసు నాటి వరకు పాలసీ కాల వ్యవధిని ఎంచుకోవచ్చు. పాలసీని కనీసం పదేళ్లకు, గరిష్టంగా 40 ఏళ్ల కాలానికి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. కనీసం రూ.25 లక్షలు, ఆపై మొత్తానికి బీమా తీసుకోవచ్చు. చౌక ప్రీమియానికే లభించే టర్మ్‌ పాలసీగా దీన్ని ఎల్‌ఐసీ అభివర్ణించింది.

మరిన్ని వార్తలు