Sakshi News home page

ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఉ‍ద్యోగులకు బిగ్‌ బొనాంజా.. వరాలు కురిపించిన కేంద్ర ప్రభుత్వం

Published Mon, Sep 18 2023 3:54 PM

Centre announces welfare measures for LIC agents employees - Sakshi

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఏజెంట్లు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఉ‍ద్యోగుల ప్రయోజనాల కోసం సంక్షేమ చర్యలను కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించింది. 

ఎల్‌ఐసీ ఏజెంట్ల (LIC agents) గ్రాట్యుటీ పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని కేంద్ర ఆర్థిక  శాఖ నిర్ణయించింది. అలాగే ప్రస్తుతం రూ. 3,000 నుంచి రూ.10,000 స్థాయిలో ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ కవర్‌ను రూ. 25,000 నుంచి రూ.150,000 స్థాయికి పెంచేందుకు అంగీకరిచింది.

(PM Vishwakarma Scheme: రూ.13,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. ప్రయోజనాలు ఇవే..) 

టర్మ్ ఇన్సూరెన్స్‌లో ఈ పెంపుదలతో మరణించిన ఏజెంట్ల కుటుంబాలకు గణనీయంగా ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. అలాగే ఎల్‌ఐసీ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం 30 శాతం చొప్పున కుటుంబ పింఛను ఇవ్వాలని నిర్ణయించారు.

దేశంలో ఎల్‌ఐసీ వృద్ధి, బీమా విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్న 13 లక్షలకు పైగా ఏజెంట్లు, లక్ష మందికి పైగా ఉద్యోగులు ఈ సంక్షేమ చర్యల ద్వారా ప్రయోజనం పొందుతారని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.

(EPFO:వేతన జీవులకు షాక్‌.. తగ్గనున్న పీఎఫ్‌ వడ్డీ!)

Advertisement

What’s your opinion

Advertisement