ఎల్‌ అండ్‌ టీకి బారీ ఆర్డర్లు

8 Jan, 2018 11:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప‍్రముఖ ఇంజనీరింగ్‌, నిర్మాణ సంస్థ లార్సన్‌ టుబ్రో భారీ ఆర్డర్‌ను సాధించింది. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్అథారిటీ (ఎపీ సీఆర్‌డీఏ)నుంచి  రూ.2,265 కోట్ల కాంట్రాక్టును ఆర్జించింది. అమరావతి క్యాపిటల్ సిటీ   ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, డిజైన్లు  కల్వర్టు,   ​నీటి సరఫరా, మురుగునీరు, మురుగునీటి శుద్ధి కర్మాగారాలు, విద్యుత్తు  యుటిలిటీ డక్ట్స్‌ తదితర నిర్మాణ  పనులు  చేపట్టనున్నట్టు  సోమవారం  వెల్లడించింది

ఏపీ రాజధాని అమరావతి రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఈ ఆర్డర్లు ఆర్జించినట్లు ఎల్ అండ్ టి  బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. ముఖ‍్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రవాణా వ్యవస్థ నీరు, నీటి పారుదల రంగాల  నుంచి ఉమ్మడిగా మూడు ఈపీసీ ఆర్డర్లను సాధించినట్టు తెలిపింది. రాజధాని నగరంలో 6, 7, 10 జోన్లలో  ఈ పనులు నిర్వహించనుంది. మూడు ఎపిసి ఆర్డర్లు జారీ చేశాయి" అని ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మేజర్ బిఎస్ఇ ఫైలింగ్లో పేర్కొంది. దీంతో సోమవారం నాటి ట్రేడింగ్‌ ఎల్‌ అండ్‌టీ షేరు భారీ లాభాలను ఆర్జిస్తోంది.
 

మరిన్ని వార్తలు