జీడీపీ భయాలు : మిశ్రమంగా ముగిసిన స్టాక్‌మార్కెట్లు

31 Aug, 2018 16:00 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  మిశ్రమంగా ముగిసాయి. ఆరంభ నష్టాలనుంచికోలుకుని 100పాయింట్లకుపైగా  పుంజుకున్న కీలక సూచీలు , చివరకు  ప్రధాన మద్దతు స్తాయిలను నిలబెట్టుకోలేకపోయాయి. సెన్సెక్స్‌ 45 పాయింట్లు క్షీణించి 38,645 వద్ద,నిఫ్టీ 4 పాయింట్లు లాభంతో 11,680 వద్ద ముగిసింది. 

బ్యాంకింగ్‌, ఆయిల్‌, మెటల్‌​ సెక్టార‍్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఐటీ, ఫార్మా రంగాలు లాభపడ్డాయి. హెచ్‌సీఎల్‌  టెక్నాలజీస్, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, టెక్ మహీంద్ర, భారతి ఇన్ఫ్రాటెల్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్‌ లాభపడ్డాయి.  ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌ బ్యాంక్‌ ,వేదాంత, ఐసీఐసీఐ,  భారతి ఎయిర్‌టెల్‌, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, నష్టాలు మార్కెట్లు ప్రభావితం  చేశాయి. మరోవైపు దేశీయ కరెన్సీ రుపీ  తొలిసారి డాలరు మారకంలో 71 రూపాయల స్థాయికి పతనమైంది.

మరిన్ని వార్తలు