4 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా భారత్‌?

20 Nov, 2023 10:37 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల (ట్రిలియన్‌) మైలురాయిని అధిగమించేసిందన్న వార్తలు ఆదివారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. దీనిపై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేసినప్పటికీ .. కేంద్ర ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో ఇది చర్చనీయాంశంగా మారింది.

భారత్‌ 4 ట్రిలియన్‌ డాలర్ల స్థాయిని దాటినట్లు చూపుతూ ఓ స్క్రీన్‌షాట్‌ వైరల్‌ అయ్యింది. దీన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి పోర్టల్‌లో వివిధ దేశాల జీడీపీ గణాంకాల లైవ్‌ ఫీడ్‌ నుంచి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

అటుపైన పారిశ్రామిక దిగ్గజం గౌతమ్‌ అదానీ, మహారాష్ట్ర డిప్యుటీ చీఫ్‌ మినిస్టర్‌ దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్‌ షెకావత్, జి. కిషన్‌రెడ్డి తదితరులు అభినందనలు తెలియజేశారు. అయితే, వార్తలపై అధికారిక స్పందన వెలువడలేదు. 

మరిన్ని వార్తలు