నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

8 Feb, 2019 09:08 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  నష్టాల్లో  ప్రారంభమైనాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో  నేపథ్యంలో ఇన్వెస్టర్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. కీలక సూచీ సెన్సెక్స్‌ 37వేల మార్క్‌ను కోల్పోయింది. సెన్సెక్స్‌ 149 పాయింట్లు క్షీణించి 36 815 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు నష్టపోయి 11025 వద్ద కొనసాగుతోంది.  దాదాపు అన్ని సెక్టార్లు బలహీనంగా ఉన్నాయి. ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్‌ నష్టపోతోంది.  టాటా స్టీల్‌, భారతి ఎయిర్‌టెల్‌,సన్‌ఫార్మ, జీ, వేదాంతా, ఐషర్‌  మోటార్స్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. ఇండియా బుల్స్‌, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, టైటన్‌ లాభపడుతున్న వాటిల్లో ఉన్నాయి.  

మరోవైపు రూపాయి శుక్రవారం పాజిటివ్‌గా మొదలైంది. డాలరు మారకంలో 71.34 వద్ద ఉంది. అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు పుంజుకున్నాయి .అటు కీలకవడ్డీరేట్లను ఆర్‌బీఐ పావు శాతంమేర తగ్గించిన నేపథ్యంలో దేశీ స్టాక్‌మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి.

మరిన్ని వార్తలు