మారుతీ కార్ల ఉత్పత్తిలో కోత

19 Mar, 2019 00:00 IST|Sakshi

ఫిబ్రవరిలో 8 శాతం పైగా కట్‌

న్యూఢిల్లీ: వాహనాలకు డిమాండ్‌ అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ ఉత్పత్తిని తగ్గించింది. ఫిబ్రవరిలో వాహనాల తయారీలో 8 శాతం పైగా కోత విధించింది. స్టాక్‌ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం మారుతీ సుజుకీ గత నెల 1,48,959 యూనిట్లు తయారు చేసింది. గతేడాది ఫిబ్రవరిలో ఉత్పత్తి చేసిన 1,62,524 యూనిట్లతో పోలిస్తే ఇది 8.3 శాతం తక్కువ కావడం గమనార్హం. ఆల్టో, స్విఫ్ట్, విటారా బ్రెజా తదితర ప్యాసింజర్‌ కార్ల ఉత్పత్తి 8.4 శాతం తగ్గింది. గత ఫిబ్రవరిలో 1,61,116 యూనిట్లతో పోలిస్తే 1,47,550 యూనిట్లకు క్షీణించింది. అయితే ఈకో, ఆమ్ని వంటి వ్యాన్స్‌ విభాగం ఉత్పత్తి 13,827 యూనిట్ల నుంచి 22.1 శాతం వృద్ధితో 16,898 యూనిట్లకు పెరిగింది. సూపర్‌ క్యారీ ఎల్‌సీవీ తయారీ ఒక్క యూనిట్‌ మేర పెరిగింది. అటు ఉత్పత్తిలో కోతకు కారణాలపై స్పందించేందుకు మారుతీ సుజుకీ నిరాకరించింది.

మారుతీ సుజుకీ ఉత్పత్తి జనవరిలో 1,58,396 యూనిట్ల నుంచి 15.6 శాతం వృద్ధితో 1,83,064 యూనిట్లకు చేరింది. ప్యాసింజర్‌ వాహనాల ఉత్పత్తి 1,56,168 యూనిట్ల నుంచి 14.3 శాతం వృద్ధి చెంది 1,78,459 యూనిట్లకు పెరిగింది. అమ్మకాల విషయానికొస్తే.. జనవరిలో మారుతీ సుజుకీ విక్రయాలు 1.1 శాతం పెరిగాయి. గతేడాది జనవరిలో నమోదైన 1,40,600 యూనిట్ల నుంచి 1,42,150 యూనిట్లకు చేరాయి. అయితే ఫిబ్రవరిలో మాత్రం దేశీ విక్రయాలు 0.9 శాతం క్షీణించి 1,39,100 యూనిట్ల నుంచి 1,37,900 యూనిట్లకు తగ్గాయి. కంపెనీకి గురుగ్రామ్, మానెసర్‌లో 15.5 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యంతో రెండు ప్లాంట్లు ఉన్నాయి. దీంతో పాటు మాతృసంస్థ సుజుకీకి గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌ ప్లాంటులో 2.5 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో ఒక లైన్‌ ఉంది.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నష్టాల్లో సూచీలు : బ్యాంకుల జోరు

హ్యుందాయ్‌ ‘కోనా’ ధర భారీగా తగ్గనుందా?

విప్రో లాభం 2,388 కోట్లు

దిగ్గజ స్టార్టప్‌కు ప్రేమ్‌జీ ఊతం

అజీం ప్రేమ్‌జీ అండతో ఆ స్టార్టప్‌ అరుదైన ఘనత

కార్పొరేట్‌ బ్రదర్స్‌ : అనిల్‌ అంబానీకి భారీ ఊరట

లాభాల్లోకి మార్కెట్లు : బ్యాంక్స్‌ జూమ్‌

రెడ్‌మి కే 20 ప్రొ వచ్చేసింది

రెడ్‌మి కే20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ : బిగ్‌ సర్‌ప్రైజ్‌

స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు

మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌

‘ఐటీఆర్‌ ఫామ్స్‌’లో మార్పుల్లేవ్‌..

ఇక ‘స్మార్ట్‌’ మహీంద్రా!

సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!

విప్రోకు ఉజ్వల భవిష్యత్‌: ప్రేమ్‌జీ

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

నేటి నుంచీ కియా ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ ప్రారంభం

ఎక్కడైనా వైఫై కనెక్టివిటీ !

అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ తాత్కాలిక మూసివేత

కొనుగోళ్ల జోష్‌ : లాభాల్లోకి సూచీలు 

ఎయిరిండియాకు భారీ ఊరట

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

మందగమనానికి ఆనవాలు!

27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి రేటు

జీవీకే ఎయిర్‌పోర్టులో 49% వాటా విక్రయం!

మార్కెట్లో ‘వాటా’ ముసలం!

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..

తమిళ ఆటకు రానా నిర్మాత