లాక్‌డౌన్‌ టైంలోనే బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లు లాభపడ్డాయ్‌..!

28 May, 2020 15:52 IST|Sakshi

లాక్‌డౌన్‌ విధింపు నుంచి నుంచి 9శాతం పెరిగిన బ్యాంక్‌ నిఫ్టీ

టాప్‌ గెయినర్లుగా నిలిచిన యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 

లాక్‌డౌన్‌ కాలంలో నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ ఇండెక్స్‌లు నష్టాలను చవిచూడలేదని ఏస్‌ఈక్విటీ గణాంకాలు చెబుతున్నాయి. విచిత్రంగా ఈ సమయంలోనే ఈ ఇండెక్స్‌లు చెప్పుకొదగిన ర్యాలీని చేశాయి. 

కేంద్రం మార్చి 24న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను విధించింది. నాటి నుంచి నిన్నటి(మే 27) వరకు బ్యాంక్‌ నిఫ్టీ, నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇండెక్స్‌ 9శాతం ర్యాలీ చేశాయి. ఇదే సమయంలో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ 19శాతం పెరిగింది.

ఐసీసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఎడెల్వీజ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాంటి ఫైనాన్స్‌ స్టాక్‌ లాక్‌డౌన్‌ సమయంలో రాణించిన షేర్లలో ఉన్నాయి. ఇ‍క నష్టపోయిన షేర్లను పరిశీలిస్తే... బజాజ్‌ ఫైనాన్స్ అత్యధిక నష్టాన్ని చవిచూసింది. వాటితో పాటు మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్స్‌ సర్వీసెస్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌ కంపెనీ షేర్లున్నాయి.

మున్ముందు మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది: ఉమేష్‌ మెహతా

ఫైనాన్షియల్ స్టాక్స్ ర్యాలీ మున్ముందు మరింత సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని సామ్‌కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా అభిప్రాయపడ్డారు. సుధీర్ఘ లాక్‌డౌన్‌, మారిటోరియటం పొడగింపు బ్యాంకులు, ఫైనాన్స్‌ కంపెనీల ఉనికి ప్రశ్నార్థకం చేస్తుందని ఆయనన్నారు. మారిటోరియం పొడిగింపు ఎన్‌పీఏ సైకిల్‌ను మరింత ఇబ్బంది పెట్టే అంశం. దాని ప్రభావం ఈ త్రైమాసికంలో కాకపోయినా వచ్చే క్వార్టర్‌ నుంచైనా స్పష్టంగా చూడవచ్చు. పొడగింపు అంశం బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్లను ప్రభావితం చేయడమే కాకుండా వాటి లాభదాయకతను దెబ్బతీస్తుంది. ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం ప్రతికూల ప్రభావానికి దారితీసింది. ఇది బ్యాంకులకు అనుకూలంగా లేదు. ఇప్పుడిప్పుడే ప్రతికూల వృద్ధి రేటు ప్రభావాన్ని చవిచూస్తున్నాం. అని  ఉమేష్‌ మెహతా తెలిపారు.

మరిన్ని వార్తలు