ఏడాదిలో ఎన్‌ఐసీ 800 కొలువులు

29 May, 2018 00:32 IST|Sakshi

350 మంది సైబర్‌ సెక్యూరిటీ నిపుణులే

భువనేశ్వర్‌: వచ్చే ఏడాది కాలంలో నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) 800 మంది నిపుణులను నియమించుకోనుంది. ఇందులో సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు 355 మంది వరకు ఉంటారని సంస్థ తెలిపింది. అంతర్జాతీయంగా సైబర్‌ ముప్పు పెరిగిపోవడంతో డేటా భద్రత కీలకంగా మారిపోయిందని పేర్కొంది. ఎన్‌ఐసీ భువనేశ్వర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన క్లౌడ్‌ ఆధారిత నేషనల్‌ డేటా సెంటర్‌ను ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సోమవారం ప్రారంభిం చారు.

ఢిల్లీ, హైదరాబాద్, పుణే తర్వాత భువనేశ్వర్‌లో ఏర్పాటు చేసిన నాలుగవ కేంద్రమిది. ఎన్‌ఐసీ ప్రస్తుతం ప్రభుత్వరంగంలో 10,000 వెబ్‌సైట్ల నిర్వహణ చూస్తోంది. దేశవ్యాప్తంగా 4,500 మంది పనిచేస్తున్నారు. కంప్యూటింగ్, స్టోరేజీకి డిమాండ్‌ ఎన్నో రెట్లు పెరిగిపోయిందని ఎన్‌ఐసీ డైరెక్టర్‌ జనరల్‌ నీతావర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో  మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ కూడా పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు