పతంజలికి పోటీగా నెస్లే తిరిగి పుంజుకుంటుందా?

21 Jun, 2016 12:46 IST|Sakshi
పతంజలికి పోటీగా నెస్లే తిరిగి పుంజుకుంటుందా?

ముంబై: వేలకోట్ల టర్నోవర్ లక్ష్యంతో  భారత మార్కెట్లోకి దూసుకు వస్తున్న పతంజలి పోటీని తట్టుకొనేందుకు నెస్లే ఇండియా ప్రణాళికలు రచిస్తోంది. మార్కెట్లో  కొత్త ప్రధాన ప్రత్యర్థి పతంజలి ఆహార ఉత్పత్తులకు దీటుగా తన నూతన 25 కొత్త ప్రొడక్ట్స్ ను పరిచయం  చేస్తోంది. తద్వారా మ్యాగీ వివాదంతో కుదేలైన తన వ్యాపారాన్ని తిరిగి కొల్లగొట్టాలని  యత్నిస్తోంది.  ఇందులో భాగంగా వివిధ కేటగిరీల్లో 25 కొత్త ఉత్పత్తులను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

ప్రస్తుతం ఇన్ స్టెంట్ నూడుల్స్‌ మార్కెట్‌లో 55.5శాతం వాటాతో  నెస్లే ఉత్పత్తులదే హవా. అయితే  రాబోయే రోజుల్లో రూ.500కోట్ల టర్నోవర్‌ లక్ష్యంతో  ప్రణాళికలు రచిస్తోంది. మార్కెట్లో మరింత ముందుకు వెళ్లడానికి ఇదే మాకు సరైన సమయమని నెస్లే ఇండియా సీఎండీ సురేష్ నారాయణన్ పిటిఐకి చెప్పారు.గతేడాది మేము తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నానీ, ఇంకా రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. మ్యాగీ నూడుల్స్ లో అనేక రకాల ప్లావర్స్ ను

కంపెనీ కొత్త ఉత్పత్తులను కొన్నింటిని  విడుదల చేసిన నారాయణ్  ఇప్పటికే ఉన్న ఉత్పత్తులను నాణ్యంగా వినియోగదారులకు అందించటంతో పాటు ముఖ్యగా పసిపిల్లలు, మహిళలు, పెద్దలు, అర్బన్ మార్కెట్ లోని వినియోగదారులను ఆకట్టుకునేలా తన ఉత్పత్తులపై దృష్టిపెట్టినట్టు చెప్పారు. ఇందులో 20-25 వరకు ఉత్పత్తులు ఉంటాయన్నారు.  వీటిలో మరికొన్నింటిని రాబోయే నాలుగు ఆరువారాల్లో రిలీజ్ చేస్తామన్నారు.  దీంతో సింగిల్ లార్జెస్ట్ విండో గా అవతరించనున్నామని ప్రకటించారు. ఇకముందు  ఈ కామర్స్ లోకి, అలాగే పానీయాల రంగంలోకి అడుగిడుతున్నట్టు తెలిపారు.

కాగా మోతాదుకు మించి లెడ్ ఉన్న కారణం ఫుడ్ స్టాండర్డ్స్ అసోసియషన్ ఆఫ్  ఇండియా గత ఏడావి మ్యాగీ  నూడల్సు ను నిషేధించిన సంగతి తెలిసిందే. మరి  కొత్త ఉత్పత్తులతో వస్తున్న నెస్లే కు వినియోగదారులనుంచి  పూర్వ ఆదరణ లభిస్తుందా.. అనుకున్నమార్కెట్ షేర్ ను కొల్లగొడుతుందా... వేచి చూడాల్సిందే..
 

మరిన్ని వార్తలు