సరికొత్త మోడళ్లతో ఆటో ఎక్స్‌పో సందడి

7 Feb, 2020 18:04 IST|Sakshi

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నోయిడాలో ఆటో ఎక్స్‌పో 2020  ఉత్సాహంగా ప్రారంభమయింది.  ఫిబ్రవరి 7 నుంచి 12వ తేదీ వరకు ఆటో ఎక్స్‌పో 2020 జరగనున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు తమ వాహనాల ప్రదర్శనతో అలరిస్తున్నారు. కార్లను ఇష్టపడేవారిని ఆకట్టుకునేందుకు కంపెనీలు సరికొత్త మోడళ్లను ఎక్స్‌పోలో ప్రదర్శిస్తున్నారు.

హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్త క్రెటా కారును ఆటో ఎక్స్‌పో 2020లో  ఆవిష్కరించారు.  రెండవ తరం హ్యుందాయ్ క్రెటా 2020 మార్చిలో రానుంది. మొదటి తరం క్రెటాను 2015 దేశంలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.   గత కొద్ది కాలంగా  కియా సెల్‌టోస్‌, ఎమ్‌ జీ హెక్టార్‌ కారణంగా క్రెటా వెనుకబడినట్లు  మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా పోటీని తట్టుకునే విధంగా సరికొత్త హ్యుందాయ్ క్రెటా మోడల్‌ను రూపొందించామని, కియాకు గట్టి పోటీనిచ్చి మార్కెట్‌లో నెంబర్‌ వన్‌ స్థానాన్ని సొంతం చేసుకుంటామని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఏప్రిల్‌ 2020 నుంచి కాలుష్య ఉద్గారాలను నియంత్రించే క్రమంలో అన్ని కంపెనీలు బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా సరికొత్త మోడళ్లను కంపెనీలు ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నాయి. కాగా వోక్స్‌వ్యాగన్, స్కోడా, ఫోర్స్ మోటార్స్  తదితర బ్రాండ్లు  ప్రదర్శనలకు రానున్నట్లు మార్కెట్లు వర్గాలు తెలిపాయి. ఎమ్‌జీ మోటార్‌ ఇండియా ఎమ్‌పీవీ జీ10 ప్రీమియమ్‌ కార్లను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఈ ఏడాదిలో  జీ10 కార్లు మార్కెట్‌లోకి రానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు