నిఫ్టీ రికార్డ్‌ ముగింపు

17 Aug, 2018 16:04 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభంనుంచి ఉత్సాహంగా  కీలక సూచీలు చివరివరకే అదే జోరును కంటిన్యూ చేయలేకపోయాయి. ఒక దశలో 300 పాయింట్లకు పైగా  సెన్సెక్స్‌ లిభపడింది. చివరికి  284 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌37,947 వద్ద ముగిసింది. అయితే  38వేల మార్క్‌ను  కొద్దిలో మిస్‌ అయింది.   అయితే నిఫ్టీ మాత్రం టీ 86 పాయింట్లు పుంజుకుని  11,470వద్ద  రికార్డ్‌ ముగింపును నమోదు  చేసింది.  ఆటో, ఫార్మా, రియాల్టి ఇలా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు అందింది.   ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకుషేర్ల లాభాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. అయితే హెచ్‌డీఎఫ్‌సీ, మారుతి, ఇన్ఫోసిస్‌, హీరో మోటా టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి.  వేదాంతా, ఐటీసీ, టాటా స్టీల్‌, ఎస్బ్యాంకు, టాటా మోటార్స్‌లాభపడ్డాయి.

మరిన్ని వార్తలు