సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ సూచీలు

10 Nov, 2023 08:43 IST|Sakshi

Stock Market Updates: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు కూడా నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభ సమయానికి సెన్సెక్స్‌ 209.79 పాయింట్ల భారీ నష్టంతో 64756.11 వద్ద, నిఫ్టీ 43.50 పాయింట్ల నష్టంతో 19351.80 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ కూడా నష్టాల్లో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.

టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్ ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, ఐచర్ మోటార్స్, హీరో మోటోకార్ప్ కంపెనీలు నష్టాల బాటలో సాగుతున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మరిన్ని వార్తలు