సాక్షి మనీ మంత్ర: దేశీయ స్టాక్‌మార్కె​ట్లు డౌన్‌.. నష్టాలతో ముగింపు

9 Nov, 2023 16:14 IST|Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. ఉదయం మోస్తరు నష్టాలతో ప్రారంభమైన దేశ బెంచ్‌మార్క్‌ సూచీలు అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో ఏ మాత్రం పుంజకోలేకపోయాయి. సెన్సెక్స్ 143 పాయింట్లు లేదా 0.22 శాతం క్షీణించి 64,832 వద్ద సెషన్‌ను ముగించగా, నిఫ్టీ 48 పాయింట్లు లేదా 0.25 శాతం తగ్గి 19,395 వద్ద ముగిసింది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్, హెచ్‌యూఎల్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్ర, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఇన్ఫోసిస్, ఓఎన్‌జీసీ, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యూపీఎల్, టైటాన్ కంపెనీ, జేఎస్‌డబ్ల్యు స్టీల్..  ప్రాఫిట్ బుకింగ్ కారణంగా నష్టాలు చవిచూశాయి. 

మరోవైపు, మహీంద్ర అండ్‌ మహీంద్ర, అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా, హీరో మోటోకార్ప్, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, ఎల్‌అండ్‌టీ షేర్లు కాస్తంత పెరిగి నష్టాలను తగ్గించుకోవడానికి ప్రయత్నించాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మరిన్ని వార్తలు