6 నెలల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం

14 Nov, 2017 12:39 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ:  దేశీయ  హోల్‌సేల్‌  ద్రవ్యోల్బణం 6 నెలల గరిష్టానికి చేరుకొంది. 2017 అక్టోబరునెలకు సంబంధించిన  టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ)  3.59 శాతంగా నమోదైంది.  గత నెలలో ఇది 2.60 శాతంగా ఉంది.


టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం వార్షిక ద్రవ్యోల్బణం అక్టోబరులో 3.59 శాతానికి పెరిగిందని మంగళవారం అధికారిక గణాంకాలు వెల్లడించాయి. కామర్స్, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) 2011-12 సంవత్సరానికి సవరించిన బేస్ సంవత్సరంతో సెప్టెంబర్ నెలలో 2.60 శాతం నుంచి 3.59 శాతానికి పెరిగింది.

మరిన్ని వార్తలు