ఎంటీ ఎడ్యుకేర్ నుంచి ‘రోబోమేట్ ప్లస్’

15 Jun, 2016 00:58 IST|Sakshi
ఎంటీ ఎడ్యుకేర్ నుంచి ‘రోబోమేట్ ప్లస్’

హైదారబాద్: ఎంటీ ఎడ్యుకేర్ సంస్థ విద్యార్థుల కోసం ‘రోబోమేట్ ప్లస్’ పేరుతో  లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌డ్, నెట్, సీఏ, ఎంబీఏ, ఎస్‌ఎస్‌సీ, సీబీఎస్‌ఈ వంటి తదితర పోటీ పరీక్షలకు విద్యార్థుల అత్యుత్తమంగా సిద్ధం కావడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. . రోబోమేట్ ప్లస్‌ను అమితాబ్ బచ్చన్ ఆవిష్కరించారని,  ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.

మరిన్ని వార్తలు