చెల్లింపు లావాదేవీలకు ఓలా మనీ యాప్

14 Nov, 2015 02:37 IST|Sakshi
చెల్లింపు లావాదేవీలకు ఓలా మనీ యాప్

న్యూఢిల్లీ: పేటీఎం, మొబిక్విక్, ఫ్రీచార్జ్ తదితర డిజిటల్ పేమెంట్ సంస్థలతో పోటీపడేందుకు ..  ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఓలా తమ మొబైల్ వాలెట్ ‘ఓలా మనీ’ని స్వతంత్ర యాప్‌గా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటిదాకా ఓలా యాప్‌లో భాగంగా ఉన్న ఓలా మనీ.. ట్యాక్సీ, ఆటో చార్జీల చెల్లింపులకు మాత్రమే ఉపయోగపడేది. ఇకపై దీనితో మొబైల్ రీచార్జీలు, నగదు బదిలీలు కూడా చేయొచ్చని ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు. త్వరలోనే విద్యుత్, నీటి బిల్లులు మొదలైన వాటి చెల్లింపులకు కూడా ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దనున్నట్లు ఆయన వివరించారు. ఓలా మనీకి ప్రస్తుతం 4 కోట్ల మంది యూజర్లు ఉన్నారని అంచనా.

మరిన్ని వార్తలు