వన్‌ ప్లస్‌  టీవీలు వచ్చేశాయ్‌

27 Sep, 2019 01:29 IST|Sakshi

ప్రారంభ ధర రూ. 69,900

న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్‌ తయారీ కంపెనీ వన్‌ప్లస్‌ భారత స్మార్ట్‌టీవీ మార్కెట్లోకి ప్రవేశించింది. క్వాంటమ్‌ డాట్‌ ఎల్‌ఈడీ టెక్నాలజీ (4కే క్యూఎల్‌ఈడీ డిస్‌ప్లే)లో రెండు వేరియంట్లలో టీవీని ఇక్కడి మార్కెట్లోకి విడుదలచేసింది. వీటి ధరల శ్రేణి రూ. 69,900 – రూ. 99,900 కాగా, ఈనెల 28 నుంచి అమ్మకాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. హెచ్‌ఆర్‌డీ 10ప్లస్‌ సపోర్ట్, 50వాట్స్‌ ఎనిమిది–స్పీకర్ల సెటప్, సినిమాటిక్‌ సౌండ్‌ కోసం డాల్బీ అట్మోస్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.  

‘7టీ స్మార్ట్‌ఫోన్‌’ విడుదల 
పండుగల సీజన్‌ నేపథ్యంలో అధునాతన స్మార్ట్‌ఫోన్‌ను వన్‌ప్లస్‌ భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ‘7టీ’ పేరిట విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ.37,999 కాగా, మునుపటి వెర్షన్‌ 7కి కొనసాగింపుగా దీన్ని విడుదలచేసింది. సెప్టెంబర్‌ 27 మధ్యాహ్నం 2 గంటల నుంచి ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, పూణే, కోల్‌కతా, బెంగళూరు, ముంబై పాప్‌–అప్‌లలో వినియోగదారులకు లభ్యం కానున్నట్లు ప్రకటించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేడు మార్కెట్లకు సెలవు

లాక్‌డౌన్: మొబైల్ యూజర్లకు ఊరట

లాక్‌డౌన్‌తో ఉద్యోగాలకు ముప్పు

కరోనా వార్తలే కీలకం

ప్రీమియంల చెల్లింపునకు మరో 30 రోజుల వ్యవధి

సినిమా

భయపడితేనే ప్రాణాలు కాపాడుకోగలం: సల్మాన్‌

‘ఆచార్య’లో మహేశ్‌.. చిరు స్పందన

తారా దీపం

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు

పేద సినీ కార్మికులకు సహాయం

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..