ఆచితూచి.. ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణ

6 Dec, 2017 00:21 IST|Sakshi

ప్రభుత్వాలకు ఐఏటీఏ సూచన 

విమానాశ్రయాల రక్షణకు పిలుపు

జెనీవా: ప్రైవేటీకరించిన ఎయిర్‌పోర్టులు పనితీరులో అంచనాలను అందుకోలేకపోతున్న నేపథ్యంలో విమానాశ్రయాల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వాలు ఆచితూచి వ్యవహరించాలని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ) డైరెక్టర్‌ జనరల్‌ అలెగ్జాండర్‌ డె జునియాక్‌ సూచించారు. దేశ ప్రయోజనాలకు పెద్ద పీట వేసేలా పటిష్టమైన నియంత్రణలతో విమానాశ్రయాలకు రక్షణ కల్పించాలన్నారు. ఐఏటీఏ ‘గ్లోబల్‌ మీడియా డే’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అలెగ్జాండర్‌ ఈ విషయాలు చెప్పారు.

‘సూటిగా చెప్పాలంటే.. ప్రైవేటీకరించిన ఏ ఎయిర్‌ పోర్టు కూడా అంచనాలకు తగ్గ పనితీరు కనబరచటం లేదు. ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణపై లోతుగా ఆలోచించాలి. యూజర్ల అవసరాలు, నాణ్యత, సాంకేతిక అంశాలకు అనుగుణంగా విమానాశ్రయాలుండాలన్నదే మా డిమాండు‘ అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు