ఆర్‌బీఐ గవర్నర్‌ను ప్రశ్నించిన పార్లమెంటరీ కమిటీ

12 Jun, 2018 14:21 IST|Sakshi
ఆర్‌బీఐ గవర్నర్‌ ఊర్జిత్‌ పటేల్‌ (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : పీఎన్‌బీ స్కామ్‌కు సంబంధించి ఆర్‌బీఐ గవర్నర్‌ ఊర్జిత్‌ పటేల్‌ను మంగళవారం పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ప్రశ్నించింది. వీరప్ప మొయిలీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశానికి హాజరైన ఊర్జిత్‌ పటేల్‌ను సభ్యులు నీరవ్‌ మోదీ-పీఎన్‌బీ స్కామ్‌పై ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. నకిలీ పత్రాలతో రూ 13,000 కోట్ల రుణాలు పొందిన నీరవ్‌ మోదీ ఉదంతం బ్యాంకింగ్‌ వ్యవస్థలో పెను ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే.

ఈ కుంభకోణాన్ని దీర్ఘకాలంగా ఎందుకు గుర్తించలేకపోయారని స్టాండింగ్‌ కమిటీ సభ్యులు ఊర్జిత్‌ పటేల్‌ను ప్రశ్నించారు. ఈ భేటీలో బ్యాంకుల్లో పేరుకుపోతున్న నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ)పైనా ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. బ్యాంకుల్లో మొండిబకాయిల వసూలు ప్రక్రియ ప్రారంభమైందని పటేల్‌ కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా వివరించారు. గతంలో మే 17న కూడా ఆర్‌బీఐ గవర్నర్‌ స్టాండింగ్‌ కమిటీ ఎదుట హాజరయ్యారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు