కోరమాండల్‌ నానోటెక్నాలజీ సెంటర్‌

18 Nov, 2023 01:00 IST|Sakshi

చెన్నై: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ తాజాగా నానోటెక్నాలజీ సెంటర్‌ను కోయంబత్తూరులో ఏర్పాటు చేసింది. ఇది మొక్కల పోషణ, పంటల రక్షణ కోసం నానో ఆధారిత ఎరువులు, సస్య రక్షణ ఉత్పత్తుల అభివృద్ధికి తోడ్పడుతుందని కంపెనీ శుక్రవారం తెలిపింది.

ఐఐటీ ముంబైలో సైతం కంపెనీకి నానోటెక్నాలజీ కేంద్రం ఉంది. కోయంబత్తూరు సెంటర్‌ కోరమాండల్‌కు ఆరవ పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా నిలిచింది.  

మరిన్ని వార్తలు